Share News

పంట బీమా నమోదుకు సాంకేతిక కష్టాలు

ABN , Publish Date - Dec 31 , 2024 | 11:20 PM

రాజ్‌మా పంట బీమా నమోదుకు సాంకేతిక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. తరచూ సర్వర్‌ మొరాయిస్తుండడంతో నమోదు ప్రక్రియలో జాప్యం జరుగుతోంది. పంట బీమా నమోదుకి డిసెంబరు 31తో గడువు ముగిసింది.

పంట బీమా నమోదుకు సాంకేతిక కష్టాలు
మీసేవా కేంద్రం వద్ద పంట బీమా నమోదు కోసం నిరీక్షిస్తున్న రైతులు

సర్వర్‌ మొరాయిస్తుండడంతో జాప్యం

రాజ్‌మా పంట బీమా నమోదుకు ముగిసిన గడువు

మరో అవకాశం ఇవ్వాలని రైతుల వేడుకోలు

చింతపల్లి, డిసెంబరు 31 (ఆంధ్రజ్యోతి): రాజ్‌మా పంట బీమా నమోదుకు సాంకేతిక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. తరచూ సర్వర్‌ మొరాయిస్తుండడంతో నమోదు ప్రక్రియలో జాప్యం జరుగుతోంది. పంట బీమా నమోదుకి డిసెంబరు 31తో గడువు ముగిసింది. మంగళవారం ఆఖరి రోజు కావడంతో మీసేవా కేంద్రాలకు రైతులు అధిక సంఖ్యలో వచ్చారు. అయితే సర్వర్‌ నెమ్మదిగా పని చేయడంతో రిజిస్ట్రేషన్‌ చేయించుకోలేకపోయారు. ఈ నేపథ్యంలో కలెక్టర్‌, ఐటీడీఏ పీవో స్పందించి పంట బీమా నమోదు గడువు పెంచాలని రైతులు బేరా సత్యనారాయణ పడాల్‌, లింగన్నపడాల్‌, బాలయ్యపడాల్‌ కోరుతున్నారు.

Updated Date - Dec 31 , 2024 | 11:20 PM