నేడు టీడీపీ ఎంపీ అభ్యర్థి శ్రీభరత్ నామినేషన్
ABN , Publish Date - Apr 22 , 2024 | 01:34 AM
విశాఖ లోక్‌సభ స్థానానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఎం.శ్రీభరత్ సోమవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు.
విశాఖపట్నం, ఏప్రిల్ 21 (ఆంధ్రజ్యోతి):
విశాఖ లోక్‌సభ స్థానానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఎం.శ్రీభరత్ సోమవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఆయన ఎంవీపీ కాలనీలోని డబుల్‌రోడ్డులో గల పార్లమెంటు ఎన్నికల కార్యాలయం నుంచి ఉదయం ఎనిమిది గంటలకు ర్యాలీగా ఓపెన్‌టాప్ వాహనంలో బయలుదేరతారు. ఇసుకతోట, మద్దిలపాలెం, గురుద్వార, సీతంపేట, ఆర్టీసీ కాంప్లెక్స్ జంక్షన్, ఎల్‌ఐసీ బిల్డింగ్స్ జంక్షన్, జగదాంబ జంక్షన్ మీదుగా కలెక్టరేట్‌కు చేరు కుంటారు. ఉదయం 11.46 గంటలకు శ్రీభరత్ నామినేషన్ దాఖలు చేస్తారు. కాగా, వైసీపీ అభ్యర్థిని బొత్స ఝూన్సీ మధ్యాహ్నం 12 గంటలకు నామినేషన్ దాఖలు చేస్తారు.