టీడీపీ సభ్యత్వ నమోదు గతం కంటే అధిగమించాలి
ABN , Publish Date - Oct 20 , 2024 | 11:19 PM
తెలుగుదేశం పార్టీ అధిష్ఠానం పిలుపు మేరకు టీడీపీ సభ్యత్వ నమోదు గతంకంటే అధిగమించాలని పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి ప్రగడ నాగేశ్వరరావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
నియోజకవర్గ ఇన్‌చార్జి ప్రగడ నాగేశ్వరరావు
ఎలమంచిలి, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ అధిష్ఠానం పిలుపు మేరకు టీడీపీ సభ్యత్వ నమోదు గతంకంటే అధిగమించాలని పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి ప్రగడ నాగేశ్వరరావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక టీడీపీ కార్యాలయంలో జరిగిన నియోజకవర్గ స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌లు ప్రధాని మోదీ సహకారంతో రాష్ట్రాభివృద్ధికి ముందుకు సాగుతున్నారన్నారు. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. పార్టీ కోసం శ్రమించిన ప్రతి ఒక్కరికి సముచిత స్థానం ఉంటుందని సీఎం చంద్రబాబు భరోసా ఇచ్చారన్నారు. మాజీ ఎమ్మెల్సీ పప్పల చలపతిరావు మాట్లాడుతూ పార్టీ శ్రేణులంతా కలిసికట్టుగా రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటేందుకు సాగాలన్నారు. గ్రామాల్లో సమస్యల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు.
గుర్తింపు లేదని నేతలు, కార్యకర్తలు అసంతృప్తి
నియోజకవర్గ స్థాయి సమావేశంలో పలువురు నేతలు, కార్యకర్తలు మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చినా నియోజకవర్గంలో టీడీపీ శ్రేణులకు సరైన గుర్తింపు లేకుండా పోయిందని వాపోయారు. పదవులు లేకపోతే గుర్తింపు ఇవ్వడం లేదని అసంతృప్తి వ్యక్తంచేశారు. టీడీపీ శ్రేణులను టార్గెట్‌గా చేసుకొని కేసులు పెడుతున్నారని ఆరోపించారు. పట్టణంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమం శిలాఫలకంపై నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్సీ పేర్లు పెట్టలేదని, ఎంతో అవమానకరంగా ఉందని కార్యకర్తలు ఆవేదన వ్యక్తంచేశారు. టీడీపీ శ్రేణులకు సరైన గుర్తింపు ఇచ్చేలా అధిష్ఠానం దృష్టికి తీసుకువెళ్లాలని సమావేశంలో తేల్చి చెప్పారు. ఈ సమావేశంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దూళి రంగనాయకులు, పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు గొర్గె నానాజీ, ఆడారి రమణబాబు, జిల్లా నేతలు కొఠారు సాంబ, రాజాన నాగేశ్వరరావు, ఇత్తంశెట్టి సన్యాసినాయుడు, కాండ్రకోట చిరంజీవి, ఇత్తంశెట్టి రాజు, రాజాన వెంకునాయుడు, మజ్జి రామకృష్ణ, కరణం రవి, పండూరి శ్రీను, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.