Share News

అరకులో బలంగా టీడీపీ

ABN , Publish Date - Mar 29 , 2024 | 12:36 AM

అరకు నియోజకవర్గంలో టీడీపీ బలంగా ఉందని, పార్టీ అభ్యర్థి దొన్నుదొర విజయం ఖాయమని నియోజకవర్గంలోని ఆ పార్టీకి చెందిన ఆరు మండలాల అధ్యక్షులు తెలిపారు. గురువారం వారు దొన్నుదొర నివాసంలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. బీజేపీ అధిష్ఠానం బుధవారం రాత్రి అరకులోయ అభ్యర్థిగా పాంగి రాజారావును ప్రకటించిన నేపథ్యంలో వీరంతా సమావేశమై తమ అభిప్రాయాలు వెల్లడించారు. ఈ సమావేశంలో ముందుగా ముంచంగిపుట్టు, అనంతగిరి, హుకుంపేట మండలాల పార్టీ అధ్యక్షులు బలరాం, బుజ్జిబాబు, తులసీరావు విలేకరులతో మాట్లాడుతూ అరకులోయలో జరిగిన బహిరంగ సభలో పార్టీ అభ్యర్థిగా దొన్నుదొరను టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు స్వయంగా ప్రకటించారన్నారు.

అరకులో బలంగా టీడీపీ
సమావేశంలో పాల్గొన్న టీడీపీ మండల అధ్యక్షులు, నాయకులు

- దొన్నుదొర విజయం ఖాయం

- ఈ సీటును బీజేపీకి కేటాయించడంపై పునరాలోచన చేయాలి

- టీడీపీ ఆరు మండలాల అధ్యక్షుల వెల్లడి

అరకులోయ, మార్చి 28: అరకు నియోజకవర్గంలో టీడీపీ బలంగా ఉందని, పార్టీ అభ్యర్థి దొన్నుదొర విజయం ఖాయమని నియోజకవర్గంలోని ఆ పార్టీకి చెందిన ఆరు మండలాల అధ్యక్షులు తెలిపారు. గురువారం వారు దొన్నుదొర నివాసంలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. బీజేపీ అధిష్ఠానం బుధవారం రాత్రి అరకులోయ అభ్యర్థిగా పాంగి రాజారావును ప్రకటించిన నేపథ్యంలో వీరంతా సమావేశమై తమ అభిప్రాయాలు వెల్లడించారు. ఈ సమావేశంలో ముందుగా ముంచంగిపుట్టు, అనంతగిరి, హుకుంపేట మండలాల పార్టీ అధ్యక్షులు బలరాం, బుజ్జిబాబు, తులసీరావు విలేకరులతో మాట్లాడుతూ అరకులోయలో జరిగిన బహిరంగ సభలో పార్టీ అభ్యర్థిగా దొన్నుదొరను టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు స్వయంగా ప్రకటించారన్నారు. దీంతో దొన్నుదొర, పార్టీ శ్రేణులు విస్తృతంగా ప్రచారం చేశారని, ఓటర్లు పూర్తి మద్దతు తెలిపారన్నారు. అయితే బుధవారం రాత్రి బీజేపీ అభ్యర్థిగా పాంగి రాజారావును ఆ పార్టీ అధిష్ఠానం ప్రకటించడం బాధ కలిగించిందన్నారు. దీనిపై ఆ పార్టీ పునరాలోచన చేయాలన్నారు.

పార్టీ నాయకులు, కార్యకర్తల నిర్ణయమే శిరోధార్యం

పొత్తుల్లో భాగంగా అరకు అసెంబ్లీ నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థిగా తానే ఉన్నానని, మార్పుపై టీడీపీ అధిష్ఠానం నుంచి ఎటువంటి సమాచారం రాలేదని దొన్నుదొర తెలిపారు. పార్టీ అధినేత చంద్రబాబునాయుడుపై తనకు పూర్తి నమ్మకం ఉందన్నారు. నియోజకవర్గంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు భయందోళన చెందాల్సిన పని లేదన్నారు. ఒకవేళ బీజేపీ అభ్యర్థిగా పాంగి రాజారావును కొనసాగిస్తే తమ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఏ నిర్ణయం తీసుకుంటే దాని మేరకు నడుచుకుంటానని ఆయన చెప్పారు. ఈ సమావేశంలో ఆరు మండలాల సీనియర్‌ నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Mar 29 , 2024 | 12:36 AM