Share News

ఉమ్మడి జిల్లాకు టీడీపీ పెద్దపీట

ABN , Publish Date - Jun 18 , 2024 | 01:29 AM

పదవుల పంపకంలో ఉమ్మడి విశాఖ జిల్లాకు తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు పెద్దపీట వేశారు.

ఉమ్మడి జిల్లాకు టీడీపీ పెద్దపీట

ముగ్గురికి కీలక స్థానాలు

స్పీకర్‌, హోం మంత్రి, పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి కట్టబెట్టిన అధినేత చంద్రబాబునాయుడు

విశాఖపట్నం, జూన్‌ 17 (ఆంధ్రజ్యోతి):

పదవుల పంపకంలో ఉమ్మడి విశాఖ జిల్లాకు తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు పెద్దపీట వేశారు. ముఖ్యమంత్రి తరువాత ప్రాధాన్యం కలిగిన స్పీకర్‌ పదవి నర్సీపట్నం ఎమ్మెల్యే చింతకాలయ అయ్యన్నపాత్రుడుకు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా ప్రభుత్వంలో కీలకమైన హోంమంత్రి పదవి పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనితకు ఇచ్చారు. అలాగే గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావును పార్టీ రాష్ట్ర అధ్యక్ష స్థానంలో కూర్చోబెట్టి విశాఖ జిల్లాపై తనకున్న అభిమానాన్ని చంద్రబాబు చాటుకున్నారు.

టీడీపీ ఆవిర్భావం తరువాత రెండు, మూడు పర్యాయాలు తప్ప విశాఖ జిల్లా ప్రజలు తెలుగుదేశం పార్టీకే అత్యధిక సీట్లు ఇస్తూ వచ్చారు. గత ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ గాలి వీచినా నగరంలోని నాలుగు నియోజక వర్గాల్లో టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు. అదే విషయాన్ని చంద్రబాబునాయుడు పలుమార్లు ప్రస్తావించేవారు. ఇక ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో మూడు ఎంపీ సీట్లకుగాను రెండు, 15 అసెంబ్లీ స్థానాలకుగాను 13 సీట్లు కూటమి అభ్యర్థులు గెలుచుకున్నారు. ఈ నేపథ్యంలో విశాఖ జిల్లాకు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించుకున్న చంద్రబాబునాయుడు మంత్రివర్గంలో పాయకరావుపేట ఎమ్మెల్యే అనితకు చోటు కల్పించారు. మంత్రివర్గంలో స్థానం ఉంటుందని భావించిన అయ్యన్నపాత్రుడుకు శాసనసభాపతిగా అవకాశం ఇస్తున్నారు. రాష్ట్రంలో అత్యధిక మెజారిటీ సాధించిన పల్లా శ్రీనివాసరావుకు రాష్ట్ర పార్టీ పగ్గాలు అప్పగించారు. జిల్లాకు కీలక పదవులు దక్కడం పట్ల పార్టీ నేతలు హర్షం

Updated Date - Jun 18 , 2024 | 07:20 AM