Share News

సూర్య ప్రతాపం

ABN , Publish Date - Apr 19 , 2024 | 12:50 AM

మన్యంలో సూర్యుడు తన ప్రతాపం చూపుతున్నాడు. వేసవి నేపథ్యంలో ఎండలు క్రమంగా పెరుగుతుండడంతో గరిష్ఠ ఉష్ణోగ్రతల్లోనూ మార్పు చోటు చేసుకుంటున్నది. కొయ్యూరులో గురువారం 41.9 డిగ్రీల సెల్సియస్‌ గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదు కాగా, డుంబ్రిగుడ, జి.మాడుగులలోనూ ఉష్ణోగ్రత 40 డిగ్రీలు దాటింది. ఇప్పటి వరకు ఒక మోస్తరుగా ఉండే ఎండలు ఉదయం నుంచే ప్రభావం చూపుతున్నాయి. మధ్యాహ్నం వేళల్లో ఎండ ధాటికి రోడ్లపై జనం కనిపించడం లేదు. సాయంత్రం ఆరు గంటల తరువాత నుంచి ఎండ లేనప్పటికీ ఉక్కపోత, వేడి వాతావరణం మాత్రం కొనసాగుతున్నది. దీంతో ప్రస్తుత ఎండల తీవ్రతకు మన్యం వాసులు సైతం అల్లాడుతున్నారు.

సూర్య ప్రతాపం
ముంచంగిపుట్టులో ఎండకు తాళలేక గొడుగులు వేసుకొని వెళుతున్న దృశ్యం

- మన్యంలో మండుతున్న ఎండలు

- కొయ్యూరులో అత్యధికంగా 41.9 డిగ్రీలు

- డుంబ్రిగుడ, జి.మాడుగులలో 40 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రత

పాడేరు, ఏప్రిల్‌ 18(ఆంధ్రజ్యోతి): మన్యంలో సూర్యుడు తన ప్రతాపం చూపుతున్నాడు. వేసవి నేపథ్యంలో ఎండలు క్రమంగా పెరుగుతుండడంతో గరిష్ఠ ఉష్ణోగ్రతల్లోనూ మార్పు చోటు చేసుకుంటున్నది. కొయ్యూరులో గురువారం 41.9 డిగ్రీల సెల్సియస్‌ గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదు కాగా, డుంబ్రిగుడ, జి.మాడుగులలోనూ ఉష్ణోగ్రత 40 డిగ్రీలు దాటింది. ఇప్పటి వరకు ఒక మోస్తరుగా ఉండే ఎండలు ఉదయం నుంచే ప్రభావం చూపుతున్నాయి. మధ్యాహ్నం వేళల్లో ఎండ ధాటికి రోడ్లపై జనం కనిపించడం లేదు. సాయంత్రం ఆరు గంటల తరువాత నుంచి ఎండ లేనప్పటికీ ఉక్కపోత, వేడి వాతావరణం మాత్రం కొనసాగుతున్నది. దీంతో ప్రస్తుత ఎండల తీవ్రతకు మన్యం వాసులు సైతం అల్లాడుతున్నారు.

గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఇలా..

కొయ్యూరులో గురువారం 41.9 డిగ్రీల సెల్సియస్‌ గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదుకాగా అనంతగిరిలో 37.5 అరకులోయలో 39.1, డుంబ్రిగుడలో 40.5, జీకేవీధిలో 39.9, జి.మాడుగులలో 40.0, హుకుంపేటలో 38.2, ముంచంగిపుట్టులో 38.4, పాడేరులో 39.6, పెదబయలులో 38.4 డిగ్రీల సెల్సియస్‌గా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Updated Date - Apr 19 , 2024 | 12:50 AM