Share News

ఎండ.. ఉక్కపోత

ABN , Publish Date - May 29 , 2024 | 01:00 AM

జిల్లాలో పలు మండలాల్లో మంగళవారం ఎండ తీవ్రతతో పాటు ఉక్కపోతతో జనం అల్లాడిపోయారు. వాతావరణ కేంద్రం అంచనాల ప్రకారం జిల్లాలో మరో రెండు రోజులు ఉక్కపోత వాతావరణం కొనసాగే అవకాశం ఉందని చెబుతున్నారు. వాతావరణ కేంద్రం గణాంకాల ప్రకారం మంగళవారం రావికమతం మండలంలో అత్యధికంగా 40.5 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది.

ఎండ.. ఉక్కపోత
మంగళవారం మధ్యాహ్నం నిర్మానుష్యంగా ఉన్న రావికమతం బీఎన్‌ రోడ్డు

- అల్లాడిన జనం

- మరో రెండు రోజులు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం

అనకాపల్లి, మే 28 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో పలు మండలాల్లో మంగళవారం ఎండ తీవ్రతతో పాటు ఉక్కపోతతో జనం అల్లాడిపోయారు. వాతావరణ కేంద్రం అంచనాల ప్రకారం జిల్లాలో మరో రెండు రోజులు ఉక్కపోత వాతావరణం కొనసాగే అవకాశం ఉందని చెబుతున్నారు. వాతావరణ కేంద్రం గణాంకాల ప్రకారం మంగళవారం రావికమతం మండలంలో అత్యధికంగా 40.5 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. మిగతా 23 మండలాల్లో పగటి పూట ఉష్ణోగ్రతలు 35 డిగ్రీలు నుంచి 39 డిగ్రీలు నమోదయ్యాయి. గాలిలో తేమ శాతం తగ్గడంతో ఉక్కపోత పెరిగిందని వాతావరణ కేంద్రం అధికారులు చెబుతున్నారు. ఎండతో పాటు విపరీతమైన ఉక్కపోతతో చిన్నారులు, బాలింతలు, వృద్ధులు, అనారోగ్యంతో మంచాన పడివున్న వారు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

Updated Date - May 29 , 2024 | 01:00 AM