Share News

ఓట్ల లెక్కింపునకు పటిష్ఠ చర్యలు

ABN , Publish Date - May 20 , 2024 | 11:42 PM

ఓట్ల లెక్కింపునకు పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నట్టు విశాఖపట్నం రేంజ్‌ డీఐజీ విశాల్‌గున్నీ తెలిపారు. జిల్లా పోలీస్‌ కార్యాలయ ఆవరణలోని ఫ్యూచర్‌ వరల్డ్‌ పాఠశాలలో స్ట్రాంగ్‌ రూమ్‌లో భద్రపరిచిన ఈవీఎంలు, వీవీ ప్యాడ్‌లను ఎస్పీ కేవీ మురళీకృష్ణతో కలిసి సోమవారం ఆయన పరిశీలించారు.

ఓట్ల లెక్కింపునకు పటిష్ఠ చర్యలు
ఈవీఎంల భద్రతా ఏర్పాట్లను పరిశీలిస్తున్న విశాఖపట్నం రేంజ్‌ డీఐజీ విశాల్‌గున్నీ

విశాఖపట్నం రేంజ్‌ డీఐజీ విశాల్‌గున్నీ

అనకాపల్లి రూరల్‌, మే 20: ఓట్ల లెక్కింపునకు పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నట్టు విశాఖపట్నం రేంజ్‌ డీఐజీ విశాల్‌గున్నీ తెలిపారు. జిల్లా పోలీస్‌ కార్యాలయ ఆవరణలోని ఫ్యూచర్‌ వరల్డ్‌ పాఠశాలలో స్ట్రాంగ్‌ రూమ్‌లో భద్రపరిచిన ఈవీఎంలు, వీవీ ప్యాడ్‌లను ఎస్పీ కేవీ మురళీకృష్ణతో కలిసి సోమవారం ఆయన పరిశీలించారు. స్ట్రాంగ్‌రూమ్‌లో భద్రపరిచిన ఈవీఎంల భద్రత ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఓట్ల లెక్కింపు రోజున 144 సెక్షన్‌, 30 పోలీస్‌ యాక్ట్‌ అమలులో ఉండేలా చూడాలన్నారు. లెక్కింపు ముగిసిన తరువాత ఎటువంటి ఊరేగింపులు, ర్యాలీలు చేయకుండా, శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చూడాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఆయన వెంట ఏఎస్పీ విజయభాస్కర్‌, అనకాపల్లి డీఎస్పీ అప్పలరాజు, ఎస్‌బీ డీఎస్పీ అప్పారావు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 20 , 2024 | 11:42 PM