Share News

స్టీల్‌ ప్లాంటు ప్రైవేటీకరణ నిలుపదల చేయండి

ABN , Publish Date - Apr 25 , 2024 | 01:50 AM

స్టీల్‌ ప్లాంటు ప్రైవేటీకరణను నిలుపుదల చేయాల్సిందిగా విశాఖపట్నం కూటమి ఎంపీ అభ్యర్థి ఎం.శ్రీభరత్‌ బుధవారం కేంద్ర రక్షణ శాఖా మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు విజ్ఞప్తి చేశారు.

స్టీల్‌ ప్లాంటు ప్రైవేటీకరణ నిలుపదల చేయండి

  • కేంద్ర రక్షణ శాఖా మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు కూటమి ఎంపీ అభ్యర్థి ఎం.శ్రీభరత్‌ విజ్ఞప్తి

  • వీలైతే సెయిల్‌లో విలీనం చేయాలని వినతి

ఎండాడ, ఏప్రిల్‌ 24:

స్టీల్‌ ప్లాంటు ప్రైవేటీకరణను నిలుపుదల చేయాల్సిందిగా విశాఖపట్నం కూటమి ఎంపీ అభ్యర్థి ఎం.శ్రీభరత్‌ బుధవారం కేంద్ర రక్షణ శాఖా మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు విజ్ఞప్తి చేశారు. నగరానికి విచ్చేసిన కేంద్ర మంత్రి గ్రాండ్‌ బే హోటల్‌లో మేధావుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీభరత్‌ మాట్లాడుతూ విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ నిర్మాణం విషయంలో ఆంధ్రుల త్యాగాలను కేంద్రం గుర్తించాలని కోరారు. స్టీల్‌ ప్లాంట్‌ నిర్మాణానికి భూములు ఇచ్చిని వారిలో చాలామందికి నేటికీ పునరావాసం కల్పించలేదంటూ, ప్రైవేటీకరణను నిలుపుదల చేయాలని, వీలైతే సెయిల్‌లో విలీనం చేయాలని కేంద్ర మంత్రికి వినతిపత్రం సమర్పించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పూర్తిగా నశించిందని, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే వారిని దోషులుగా చిత్రీకరించి నానాహింసలు పెడుతున్నారని ఆరోపించారు. సమావేశంలో ఉత్తర నియోజకవర్గ కూటమి అభ్యర్థి పి.విష్ణుకుమార్‌రాజు మాట్లాడుతూ ఏపీ తిరోగమనంలో ఉందన్నారు. ఇసుక, మాఫియా, లిక్కర్‌ మాఫియాలు విజృంభించి శాంతి భద్రతలకు విఘాతం కలిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్‌, ఎలమంచిలి జనసేన అభ్యర్థి సుందరపు విజయకుమార్‌, విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడు గండి బాబ్జీ, విశాఖ బీజేపీ అధ్యక్షులు రవీంద్రరెడ్డి, జనసేన నాయకురాలు ఉషాకిరణ్‌, పలు వర్గాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు.

Updated Date - Apr 25 , 2024 | 01:50 AM