Share News

శ్రీధర్‌కు రాష్ట్ర జీవ వైవిధ్య సంరక్షణ అవార్డు

ABN , Publish Date - May 23 , 2024 | 12:48 AM

ప్రపంచ జీవ వైవిధ్య దినోత్సవం సందర్భంగా అనకాపల్లి పట్టణానికి చెందిన కొణతాల ఫణిభూషణ్‌శ్రీధర్‌ జీవవైవిధ్య సంరక్షణ అవార్డును అందుకున్నారు.

శ్రీధర్‌కు రాష్ట్ర జీవ వైవిధ్య సంరక్షణ అవార్డు
అవార్డు అందుకుంటున్న కొణతాల ఫణిభూషణ్‌ శ్రీధర్‌

తుమ్మపాల, మే 22 : ప్రపంచ జీవ వైవిధ్య దినోత్సవం సందర్భంగా అనకాపల్లి పట్టణానికి చెందిన కొణతాల ఫణిభూషణ్‌శ్రీధర్‌ జీవవైవిధ్య సంరక్షణ అవార్డును అందుకున్నారు. ఏపీ జీవ వైవిధ్య మండలి, జాతీయ జీవవైవిధ్య అథారిటీ ఆధ్వర్యంలో బుధవారం విశాఖలో జరిగిన కార్యక్రమంలో కొణతాల ఫణిభూషణ్‌శ్రీధర్‌కు ఈ అవార్డును ఐఎఫ్‌ఎస్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ, ప్రిన్సిపల్‌ చీఫ్‌ కనెజర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ చిరంజీవి చౌదరి అందజేశారు. గత 22 ఏళ్లగా శ్రీధర్‌ జీవ వైవిధ్య సంరక్షణ కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రధానంగా విత్తన బంతుల తయారీ, పిచ్చుకల సంరక్షణ, ఔషధ మొక్కల ఏర్పాటు తదితర కార్యక్రమాలను చేపడుతున్నారు.

Updated Date - May 23 , 2024 | 12:48 AM