Share News

సబ్బవరం స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ

ABN , Publish Date - Jul 24 , 2024 | 12:43 AM

సబ్బవరం పోలీస్‌ స్టేషన్‌ను ఎస్పీ దీపిక మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.

సబ్బవరం స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ
డీఎస్పీ కేవీ సత్యనారాయణ, సీఐ పిన్నింటి రమణతో మాట్లాడుతున్న ఎస్పీ దీపిక

సబ్బవరం, జూలై 23: సబ్బవరం పోలీస్‌ స్టేషన్‌ను ఎస్పీ దీపిక మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సీజ్‌ చేసిన వాహనాలను పరిశీలించి, వాటి వివరాలను వాహనాలకు ట్యాగ్‌ చేయాలని సూచించారు.. రికార్డులు పరిశీలించి తరచూ నమోదవుతున్న నేరాలు, రౌడీ షీటర్ల వివరాలు, గతంలో స్టేషన్‌ పరిధిలో నమోదైన గంజాయి కేసుల సీడీ ఫైల్స్‌, తీవ్రమైన కేసుల సీడీ ఫైల్స్‌ను పరిశీలించారు. ఆయా కేసుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె సిబ్బందితో మాట్లాడుతూ స్టేషన్‌ రిసెప్షన్‌ పుస్తకం నిర్వహించాలని, ఫిర్యాదుదారులతో మర్యాదగా మెలగాలని సూచించారు. రౌడీ షీటర్లపై దృష్టి సారించాలన్నారు. గంజాయి రవాణాపై దృష్టి పెట్టి, కారకులైన వారిని గుర్తించి అరెస్టు చేయాలని ఆదేశించారు. నేరాలు, రోడ్డు ప్రమాదాల నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టాలని ఆమె సూచించారు. ఆమె వెంట పరవాడ డీఎస్పీ కేవీ సత్యనారాయణ, సీఐ పిన్నింటి రమణ, సిబ్బంది ఉన్నారు.

Updated Date - Jul 24 , 2024 | 12:44 AM