Share News

గోవాడ షుగర్స్‌లో మందకొడిగా క్రషింగ్‌

ABN , Publish Date - Jan 30 , 2024 | 11:44 PM

గోవాడ షుగర్‌ ఫ్యాక్టరీలో సాంకేతిక సమస్యల కారణంగా రెండు సార్లు క్రషింగ్‌కు అంతరాయం ఏర్పడింది. దీంతో మందకొడిగా క్రషింగ్‌ సాగుతోంది.

గోవాడ షుగర్స్‌లో మందకొడిగా క్రషింగ్‌
గోవాడ యార్డులో నిలిచిన చెరకు బళ్లు

బాయిలర్‌ హౌస్‌లో సాంకేతిక లోపం వల్ల రెండు సార్లు అంతరాయం

యార్డులో భారీగా నిలిచిపోయిన చెరకు బళ్లు

చోడవరం, జనవరి30: గోవాడ షుగర్‌ ఫ్యాక్టరీలో సాంకేతిక సమస్యల కారణంగా రెండు సార్లు క్రషింగ్‌కు అంతరాయం ఏర్పడింది. దీంతో మందకొడిగా క్రషింగ్‌ సాగుతోంది. బాయిలింగ్‌ హౌస్‌లో తలెత్తిన సాంకేతిక సమస్య కారణంగా సోమవారం రాత్రి క్రషింగ్‌ నిలిపివేసి మరమ్మతులు చేపట్టారు. దీంతో క్రషింగ్‌ నిలిచిపోయింది. మరమ్మతులు చేపట్టి తిరిగి మంగళవారం తెల్లవారుజామున క్రషింగ్‌ ప్రారంభించిన కొద్దిసేపటికే మరోసారి అంతరాయం ఏర్పడింది. మళ్లీ మరమ్మతులు చేసి మధ్యాహ్నం క్రషింగ్‌ ప్రారంభించారు. కాగా గోవాడలో క్రషింగ్‌ ఆలస్యంగా సాగుతుండడంతో యార్డులో చెరకు బళ్లు భారీగా నిలిచిపోయాయి. ఇదే సమయంలో కాటాల వద్ద కూడా చెరకు ఎక్కువ రోజులు నిల్వ ఉండిపోతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

Updated Date - Jan 30 , 2024 | 11:44 PM