Share News

రూ.1528.92 కోట్లతో ఆరు ప్రాజెక్టులు

ABN , Publish Date - Mar 06 , 2024 | 01:09 AM

జీవీఎంసీ పరిధిలో రూ.1528.92 కోట్లతో ఆరు పనులు చేపట్టేందుకు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం శంకుస్థాపన చేశారు.

రూ.1528.92 కోట్లతో ఆరు ప్రాజెక్టులు

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి శంకుస్థాపన

ముడసర్లోవలో రూ.99.47 కోట్లతో జీవీఎంసీ కార్యాలయ భవన నిర్మాణం

విశాఖపట్నం, మార్చి 5 (ఆంధ్రజ్యోతి):

జీవీఎంసీ పరిధిలో రూ.1528.92 కోట్లతో ఆరు పనులు చేపట్టేందుకు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం శంకుస్థాపన చేశారు. రాడిసన్‌ బ్లూ హోటల్‌లో పారిశ్రామికవేత్తలతో జరిగిన సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన ఆయన...హోటల్‌ప్రాంగణంలోనే ఆయా పనులకు సంబంధించిన శిలాఫలకాలను ఆవిష్కరించారు. జోన్‌-2 (మధురవాడ) పరిధిలో పారిశ్రామిక క్లస్టర్లతోపాటు గృహ అవసరాల కోసం రూ.595 కోట్లతో చేపట్టబోయే 15 ఎంజీడీ నీటి సరఫరా ప్రాజెక్టుకు, జోన్‌-2 ప్రాంతంలో సమగ్ర మురుగునీటి శుద్ధి, నెట్‌వర్క్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు రూ.553 కోట్లతో ప్రాజెక్టును, ముడసర్లోవ ప్రాంతంలో జీవీఎంసీ, విస్కో సంయుక్తంగా రూ.99.47 కోట్ల వ్యయంతో నిర్మించే జీవీఎంసీ ఇంటిగ్రేటెడ్‌ కార్యాలయ భవన నిర్మాణం, జోన్‌-5, జోన్‌-6, జోన్‌-8 పరిధిలో రూ.231.04 కోట్లతో నీటిసరఫరా, యూజీడీ అభివృద్ధి పనులు, సాగర్‌నగర్‌ బీచ్‌లో పర్యావరణ హితం కోసం రూ.15.65 కోట్లతో తాబేళ్ల అభివృద్ధి జోన్‌ ఏర్పాటు, సింహాచలం గిరి ప్రదక్షణ కోసం జాతీయ రహదారికి సమాంతరంగా రూ.34.76 కోట్లతో రోడ్డు విస్తరణ పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు, మంత్రులు బొత్స సత్యనారాయణ, ఆదిమూలపు సురేష్‌, గుడివాడ అమర్‌నాథ్‌, విడదల రజని, విప్‌ కరణం ధర్మశ్రీ, మేయర్‌ గొలగాని హరివెంటకుమారి, ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, జిల్లా కలెక్టర్‌ ఎ.మల్లికార్జున, జీవీఎంసీ కమిషనర్‌ సీఎం సాయికాంత్‌వర్మ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 06 , 2024 | 01:09 AM