Share News

ఎన్నికల ఏర్పాట్ల పరిశీలన

ABN , Publish Date - Mar 12 , 2024 | 12:42 AM

అరకులోయ అసెంబ్లీ స్థానం ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, ఐటీడీఏ పీవో వి.అభిషేక్‌ స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో ఎన్నికల ఏర్పాట్లను సోమవారం పరిశీలించారు. అరకులోయ అసెంబ్లీ స్థానానికి సంబంధించిన ఎన్నికల సామగ్రికి సంబంధించి స్ట్రాంగ్‌ రూమ్‌, కౌంటింగ్‌ హాలు తదితరాలను ఆయన స్వయంగా పరిశీలించారు.

ఎన్నికల ఏర్పాట్ల పరిశీలన
పాడేరు డిగ్రీ కళాశాల ఆవరణలో అధికారులకు సూచనలిస్తున్న ఐటీడీఏ పీవో అభిషేక్‌

- సదుపాయాల కల్పనపై అధికారులకు ఐటీడీఏ పీవో సూచన

పాడేరు, మార్చి 11(ఆంధ్రజ్యోతి): అరకులోయ అసెంబ్లీ స్థానం ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, ఐటీడీఏ పీవో వి.అభిషేక్‌ స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో ఎన్నికల ఏర్పాట్లను సోమవారం పరిశీలించారు. అరకులోయ అసెంబ్లీ స్థానానికి సంబంధించిన ఎన్నికల సామగ్రికి సంబంధించి స్ట్రాంగ్‌ రూమ్‌, కౌంటింగ్‌ హాలు తదితరాలను ఆయన స్వయంగా పరిశీలించారు. మండలాల వారీగా ఈవీఎంల పంపిణీ, స్వీకరణకు కౌంటర్లు, ఎన్నికల సిబ్బందికి ఫుడ్‌ కౌంటర్లు ఎలా ఏర్పాటు చేయాలనే దానిపై అధికారులను ఆయన సూచించారు. డిగ్రీ కళాశాల మైదానం అంతా విద్యుత్‌ వెలుగులు ఉండాలని, ఎన్నికల సిబ్బంది సామగ్రి తరలించేందుకు, ఎన్నికల అనంతరం ఆయా యంత్రాలను స్ట్రాంగ్‌ రూమ్‌లో భద్రపరిచేందుకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పటిష్ఠ చర్యలు చేపట్టాలన్నారు. కౌంటింగ్‌ సిబ్బంది, రాజకీయ పార్టీలకు చెందిన ఏజెంట్లకు వేర్వేరుగా ప్రవేశ ద్వారాలు ఏర్పాటు చేయాలన్నారు. ఆయన వెంట గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్‌ శాఖ ఈఈ డీవీఆర్‌ఎం రాజు, డీఈఈ పి.అనుదీప్‌, అరకులోయ తహసీల్దార్‌ పి.సోమేశ్వరరావు, తదితరులు వున్నారు.

Updated Date - Mar 12 , 2024 | 12:43 AM