Share News

శభాష్‌ ‘మేధ’ర్షి!

ABN , Publish Date - Mar 18 , 2024 | 12:39 AM

కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న సైనిక్‌ స్కూళ్లలో ఆరో తరగతిలో ప్రవేశాలకు నిర్వహించిన పరీక్షలో మండలంలోని నునపర్తి గ్రామానికి చెందిన రెడ్డి మేధర్షి రాష్ట్రస్థాయిలో ప్రథమ ర్యాంకు సాధించాడు. ఈ ఏడాది జనవరి 28వ తేదీన నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ఈ ప్రవేశ పరీక్ష నిర్వహించగా, ఈ నెల 14వ తేదీన ఫలితాలు వెల్లడయ్యాయి.

శభాష్‌ ‘మేధ’ర్షి!
రెడ్డి మేధర్షి

సైనిక్‌ స్కూల్‌ ప్రవేశ పరీక్షలో నునపర్తి విద్యార్థికి ఫస్ట్‌ ర్యాంక్‌

283/300 మార్కులు సాధించిన రెడ్డి మేధర్షి

జాతీయస్థాయిలో 43వ ర్యాంకు

అచ్యుతాపురం, మార్చి 17: కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న సైనిక్‌ స్కూళ్లలో ఆరో తరగతిలో ప్రవేశాలకు నిర్వహించిన పరీక్షలో మండలంలోని నునపర్తి గ్రామానికి చెందిన రెడ్డి మేధర్షి రాష్ట్రస్థాయిలో ప్రథమ ర్యాంకు సాధించాడు. ఈ ఏడాది జనవరి 28వ తేదీన నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ఈ ప్రవేశ పరీక్ష నిర్వహించగా, ఈ నెల 14వ తేదీన ఫలితాలు వెల్లడయ్యాయి. రెడ్డి మేధర్షి 283/300 మార్కులతో జాతీయ స్థాయిలో 43వ ర్యాంకు, రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంకు సాధించాడు. తల్లిదండ్రులు రాజేశ్‌, స్వర్ణలత ఉద్యోగరీత్యా హైదరాబాద్‌లో వుంటున్నారు. మేధర్షి రెగ్యులర్‌ పాఠశాలకు వెళుతూనే ఆన్‌లైన్లో వైజాగ్‌ సైనిక్‌ అకాడమీ సెంటర్లో కోచింగ్‌ తీసుకున్నట్టు తల్లిదండ్రులు తెలిపారు.

Updated Date - Mar 18 , 2024 | 12:39 AM