Share News

‘ఆర్టీసీ రిటైర్డు ఎంప్లాయీస్‌ డిమాండ్‌లను నెరవేర్చాలి’

ABN , Publish Date - Jul 31 , 2024 | 12:47 AM

ఏపీఎస్‌ ఆర్టీసీ రిటైర్డు కార్మికుల న్యాయమైన డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని ఏపీఎస్‌ ఆర్టీసీ రిటైర్డు ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు వీవీకే రాయ్‌ డిమాండ్‌ చేశారు. మంగళవారం సీపీఐ కార్యాలయంలో రిటైర్డు ఎంప్లాయీస్‌ జనరల్‌ బాడీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆర్టీసీ రిటైర్డు ఎంప్లాయీస్‌కు మినిమం రూ.తొమ్మిది వేలు పింఛన్‌ను అందజేయాలన్నారు. అలాగే డీఏ, ఈఎస్‌ఐ సదుపాయాలు కల్పించాలన్నారు. ప్రస్తుతం సమాజంలో పెరుగుతున్న నిత్యావసర ధరలు, వైద్య ఖర్చులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం రిటైర్డు ఎంప్లాయీస్‌కు న్యాయం చేయాలన్నారు. డిమాండ్ల సాధన కోసం ఆగస్టు 20న విశాఖలోని పీఎఫ్‌ కార్యాలయం వద్ద జరిగే ధర్నాను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో అసోసియేషన్‌ ప్రతినిధులు ఏవీ రావు, సీహెచ్‌ పైడిరాజు, రాజానదొరబాబు, సత్యవతి, టీఎం దొర, విత్తనాల పోతురాజు తదితరులు పాల్గొన్నారు.

‘ఆర్టీసీ రిటైర్డు ఎంప్లాయీస్‌ డిమాండ్‌లను నెరవేర్చాలి’
మాట్లాడుతున్న వీవీకే రాయ్‌

తుమ్మపాల, జూలై 30 : ఏపీఎస్‌ ఆర్టీసీ రిటైర్డు కార్మికుల న్యాయమైన డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని ఏపీఎస్‌ ఆర్టీసీ రిటైర్డు ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు వీవీకే రాయ్‌ డిమాండ్‌ చేశారు. మంగళవారం సీపీఐ కార్యాలయంలో రిటైర్డు ఎంప్లాయీస్‌ జనరల్‌ బాడీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆర్టీసీ రిటైర్డు ఎంప్లాయీస్‌కు మినిమం రూ.తొమ్మిది వేలు పింఛన్‌ను అందజేయాలన్నారు. అలాగే డీఏ, ఈఎస్‌ఐ సదుపాయాలు కల్పించాలన్నారు. ప్రస్తుతం సమాజంలో పెరుగుతున్న నిత్యావసర ధరలు, వైద్య ఖర్చులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం రిటైర్డు ఎంప్లాయీస్‌కు న్యాయం చేయాలన్నారు. డిమాండ్ల సాధన కోసం ఆగస్టు 20న విశాఖలోని పీఎఫ్‌ కార్యాలయం వద్ద జరిగే ధర్నాను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో అసోసియేషన్‌ ప్రతినిధులు ఏవీ రావు, సీహెచ్‌ పైడిరాజు, రాజానదొరబాబు, సత్యవతి, టీఎం దొర, విత్తనాల పోతురాజు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 31 , 2024 | 12:47 AM