Share News

అనకాపల్లిలో రోడ్డు నిర్మాణం అడ్డగింత

ABN , Publish Date - May 31 , 2024 | 12:27 AM

స్థానిక సుంకరమెట్ట జంక్షన్‌ నుంచి జలగలమదుం జంక్షన్‌ మధ్య కొద్ది కాలంగా వివాదాస్పదంగా నిలిచిన రహదారి నిర్మాణ విషయమై గురువారం జీవీఎంసీ అధికారులకు స్థల యజమానులకు మధ్య వాదనలు జరిగాయి.

అనకాపల్లిలో రోడ్డు నిర్మాణం అడ్డగింత
నిర్మాణం ప్రదేశం వద్ద ఉన్న జడ్సీ అయ్యప్పనాయుడు

అనకాపల్లి టౌన్‌, మే 30 : స్థానిక సుంకరమెట్ట జంక్షన్‌ నుంచి జలగలమదుం జంక్షన్‌ మధ్య కొద్ది కాలంగా వివాదాస్పదంగా నిలిచిన రహదారి నిర్మాణ విషయమై గురువారం జీవీఎంసీ అధికారులకు స్థల యజమానులకు మధ్య వాదనలు జరిగాయి. నష్టపరిహారం కింద టీడీఆర్‌లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని, అయితే స్థలం ఎవరి పేరున ఉందో ఆన్‌లైన్‌లో నమోదు కాకపోవడంతో జాప్యం జరుగుతుందని జోనల్‌ కమిషనర్‌ అయ్యప్పనాయుడు చెబుతుండగా టీడీఆర్‌ ఇస్తేనే రోడ్డు వేసేందుకు అనుమతించేదంటూ యజమానులు పట్టుబట్టారు. దీంతో సమస్య జఠిలమైంది. రూ. కోటి 93 లక్షలతో సుంకరమెట్ట జంక్షన్‌ నుంచి జలగలమదుం జంక్షన్‌ వరకు రహదారి నిర్మాణం చేపట్టారు. మధ్యలో పెట్రోల్‌ బంకు వద్ద రోడ్డు నిర్మాణానికి సమస్య తలెత్తడంతో 17 మీటర్ల రోడ్డు నిర్మాణం నిలిచిపోయింది. రోడ్డు నిర్మాణం చేపట్టేందుకు పలు దఫాలుఅధికారులు ప్రయత్నించినప్పటికీ పరిహారం ఇస్తేనే గాని తమ స్థలంలో నిర్మాణానికి అంగీకరించబోమని యజమానులు స్పష్టం చేయడంతో చేసేదేమి లేక అధికారులు వెనుదిరిగారు.

Updated Date - May 31 , 2024 | 12:27 AM