Share News

బెల్లం లావాదేవీలు పునఃప్రారంభం

ABN , Publish Date - Apr 27 , 2024 | 12:47 AM

స్థానిక ఎన్టీఆర్‌ మార్కెట్‌ యార్డులో శుక్రవారం బెల్లం లావాదేవీలు పునఃప్రారంభమయ్యాయి. కొలగారం, బెల్లం దిమ్మల అపహరణ విషయంలో కొలగార్లకు, వర్తకులకు మధ్య విభేదాలు తలెత్తిన కారణంగా ఈ నెల 18వ తేదీ నుంచి యార్డులో బెల్లం లావాదేవీలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే.

బెల్లం లావాదేవీలు పునఃప్రారంభం
బెల్లం దించుతున్న కొలగార్లు

- ఎన్టీఆర్‌ మార్కెట్‌ యార్డులో యథావిధిగా కార్యకలాపాలు

అనకాపల్లి టౌన్‌, ఏప్రిల్‌ 26: స్థానిక ఎన్టీఆర్‌ మార్కెట్‌ యార్డులో శుక్రవారం బెల్లం లావాదేవీలు పునఃప్రారంభమయ్యాయి. కొలగారం, బెల్లం దిమ్మల అపహరణ విషయంలో కొలగార్లకు, వర్తకులకు మధ్య విభేదాలు తలెత్తిన కారణంగా ఈ నెల 18వ తేదీ నుంచి యార్డులో బెల్లం లావాదేవీలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. అధికారులు గురువారం సాయంత్రం వర్తకులు, కొలగార్లతో సమావేశమై చర్చించారని, కొలగారం రెండు రోజులకోసారి ఇవ్వడానికి అంగీకారం కుదిరిందని మార్కెట్‌ కమిటీ కార్యదర్శి శకుంతల తెలిపారు. ఎన్నికల సమయంలో అంతా బిజీగా ఉన్నందున ఎన్నికల తరువాత బెల్లం మార్కెట్‌లో బెల్లం దిమ్మల అపహరణకు సంబంధించిన అంశంపై చర్చించి ఒక నిర్ణయం తీసుకుందామని కొలగార్లు కోరారని, యథావిధిగా కొలగారం ఇవ్వడానికి అంగీకారం కుదిరినందున లావాదేవీలు కొనసాగించాలని అధికారులు సూచించారని చెప్పారు. దీంతో శుక్రవారం యార్డుకు వివిధ ప్రాంతాల నుంచి రైతులు తీసుకువచ్చిన బెల్లాన్ని కొలగార్లు ప్లాట్‌ఫారంపైకి దించి అమ్మకాలు సాగించారు. రైతులు 6,034 బెల్లం దిమ్మలను తీసుకువచ్చారు. ఒకటో రకం రూ.4,390లు, రెండో రకం రూ.4,060లు, మూడో రకం రూ.3,510లు ధరలు పలికాయి.

Updated Date - Apr 27 , 2024 | 12:47 AM