Share News

ఆరోగ్యశ్రీ సేవలు పునఃప్రారంభం

ABN , Publish Date - May 26 , 2024 | 12:32 AM

ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆస్పత్రులు సమ్మె విరమించాయి.

ఆరోగ్యశ్రీ సేవలు పునఃప్రారంభం

సమ్మె విరమించిన నెట్‌వర్క్‌ ఆస్పత్రులు

విశాఖపట్నం, మే 25 (ఆంధ్రజ్యోతి):

ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆస్పత్రులు సమ్మె విరమించాయి. రాష్ట్ర ప్రభుత్వం భారీగా బిల్లులు పెండింగ్‌ పెట్టడంతో ఈ నెల 22వ తేదీ నుంచి సేవలు నిలిపివేశాయి. రాష్ట్రవ్యాప్తంగా రూ.1,500 కోట్ల వరకూ చెల్లించాల్సి ఉండగా...జిల్లాలోని 50కుపైగా హాస్పిటల్స్‌కు రూ.80 కోట్లకుపైగా రావలసి ఉంది. ఈ మొత్తాన్ని చెల్లించాల్సిందిగా ఆస్పత్రులు సమ్మెకు దిగాయి. దీంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఈ విషయం ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో శుక్రవారం సీఎస్‌ నేతృత్వంలో ఆరోగ్యశ్రీ అధికారులు నెట్‌వర్క్‌ ఆస్పత్రుల ప్రతినిధులతో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా బకాయిల విడుదలకు సీఎస్‌, ఇతర ఉన్నతాధికారులు స్పష్టమైన హామీ ఇవ్వడంతో ఆస్పత్రులు అసోసియేషన్‌ ప్రతినిధులు సమ్మె విరమణకు అంగీకరించారు. ఈ మేరకు నెట్‌వర్క్‌ పరిధిలో గల ఆస్పత్రులు శనివారం నుంచి ఆరోగ్యశ్రీ సేవలను యథావిధిగా అందిస్తున్నాయి.

Updated Date - May 26 , 2024 | 12:32 AM