Share News

రాజ్‌మాకు రికార్డు స్థాయి ధర

ABN , Publish Date - Jan 07 , 2024 | 12:40 AM

మన్యంలో రాజ్‌మాకు ఈ ఏడాది రికార్డు స్థాయి ధర లభించింది. హుకుంపేటలో శనివారం జరిగిన వారపు సంతలో కిలో రూ.150 చొప్పున గిరిజన రైతుల వద్ద వర్తకులు కొనుగోలు చేశారు.

రాజ్‌మాకు రికార్డు స్థాయి ధర
రాజ్‌మా గింజలు

- గతేడాది కిలో రూ.65

- ప్రస్తుతం కిలో రూ.150

- మిచౌంగ్‌ తుఫాన్‌ ప్రభావంతో దిగుబడి లేకపోవడమే కారణం

పాడేరు, జనవరి 6(ఆంధ్రజ్యోతి): మన్యంలో రాజ్‌మాకు ఈ ఏడాది రికార్డు స్థాయి ధర లభించింది. హుకుంపేటలో శనివారం జరిగిన వారపు సంతలో కిలో రూ.150 చొప్పున గిరిజన రైతుల వద్ద వర్తకులు కొనుగోలు చేశారు. గత ఐదేళ్లు కిలో రూ.55 నుంచి రూ.65 ధరకు మాత్రమే ఉండే రాజ్‌మా గత వారం రూ.85 వరకు పెరిగింది. మిచౌంగ్‌ తుఫాన్‌ ప్రభావంతో ఏజెన్సీలో రాజ్‌మా పంట దెబ్బతింది. దీంతో పంట దిగుబడి ఘోరంగా తగ్గింది. అందువల్లే ఊహించని విధంగా రాజ్‌మాకు మంచి ధర లభించిందని రైతులు, వర్తకులు తెలిపారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో ఈ ఏడాదికి ఈ ధర నిలకడగా ఉండడం లేదా కాస్త పెరగడం తప్ప తగ్గే అవకాశాలు కనిపించడం లేదని వర్తకులు అంటున్నారు. రాజ్‌మా ధర ఆశాజనకంగా ఉండడంతో గిరిజన రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Jan 07 , 2024 | 12:40 AM