Share News

శరవేగంగా చింతాలమ్మ ఘాట్‌ రోడ్డు విస్తరణ

ABN , Publish Date - Apr 19 , 2024 | 12:52 AM

జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా మండలంలో ఏడొంపుల ఘాట్‌గా ప్రసిద్ధి చెందిన చింతాలమ్మ ఘాట్‌ రోడ్డు విస్తరణ పనులు జోరుగా సాగుతున్నాయి. రహదారికి ఇరువైపులా చెట్లను తొలగించి చదును చేస్తున్నారు. రాజమహేంద్రవరం- విజయనగరం జాతీయ రహదారి 516-ఈ పనుల్లో భాగంగా మండలంలో ని కృష్ణాదేవిపేట- కొయ్యూరు ప్రధాన రహదారి మధ్యలో రావణాపల్లి దాటాక సుమారు ఐదు కిలోమీటర్లు మేర ఉన్న ఏడొంపుల ఘాట్‌ రోడ్డును రెండు లైన్లుగా విస్తరించి పనులు చేపడుతున్నారు

శరవేగంగా చింతాలమ్మ ఘాట్‌ రోడ్డు విస్తరణ
చింతాలమ్మ ఘాట్‌ రోడ్డు విస్తరణకు చెట్లను తొలగించడంతో ఇలా..

- జాతీయ రహదారి నిర్మాణం నేపథ్యంలో పనులు

కొయ్యూరు, ఏప్రిల్‌ 18: జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా మండలంలో ఏడొంపుల ఘాట్‌గా ప్రసిద్ధి చెందిన చింతాలమ్మ ఘాట్‌ రోడ్డు విస్తరణ పనులు జోరుగా సాగుతున్నాయి. రహదారికి ఇరువైపులా చెట్లను తొలగించి చదును చేస్తున్నారు. రాజమహేంద్రవరం- విజయనగరం జాతీయ రహదారి 516-ఈ పనుల్లో భాగంగా మండలంలో ని కృష్ణాదేవిపేట- కొయ్యూరు ప్రధాన రహదారి మధ్యలో రావణాపల్లి దాటాక సుమారు ఐదు కిలోమీటర్లు మేర ఉన్న ఏడొంపుల ఘాట్‌ రోడ్డును రెండు లైన్లుగా విస్తరించి పనులు చేపడుతున్నారు. ఘాట్‌ రోడ్డులో ఐదు కిలోమీటర్లు కొండను దొలిచి బీటీ రోడ్డు నిర్మాణానికి వీలుగా మట్టి పనులు దాదాపు పూర్తయ్యాయి. దీంతో ఘాట్‌ పైనుంచి దిగువ వరకు చూపరులను ఆకట్టుకునేలా ఘాట్‌ ఒంపులు దర్శనమిస్తున్నాయి. ఈ రహదారి పనులు పూర్తయితే రాకపోకలకు వీలుగా ఉంటుందని వాహనచోదకులు చెబుతున్నారు.

Updated Date - Apr 19 , 2024 | 12:53 AM