Share News

రంగవల్లుల హరివిల్లు!

ABN , Publish Date - Jan 08 , 2024 | 01:18 AM

సప్తవర్ణాల రంగవల్లులు.. గొబ్బెమ్మలు.. రంగురంగుల పూలతో అలంకరించిన ముత్యాల ముగ్గులతో అనకాపల్లి పట్టణానికి వారం రోజులు ముందుగానే సంక్రాంతి పండుగ వచ్చేసింది. ‘ఏబీఎస్‌-ఆంధ్రజ్యోతి’ ఆదివారం ఇక్కడ నిర్వహించిన ముత్యాల ముగ్గుల పోటీలకు గృహిణులు, యువతుల నుంచి విశేష స్పందన లభించింది. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని ‘ఆంధ్రజ్యోతి- ఏబీఎన్‌’...కెనరా బ్యాంక్‌ ముత్యాల ముగ్గుల పోటీలు...పవర్డ్‌ బై ఎయిమ్స్‌ విద్యా సంస్థలు, బెంగుళూరు...రియల్‌ పార్టనర్‌ స్వర్గసీమ సుకేతన’ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం ఎన్టీఆర్‌ మునిసిపల్‌ స్టేడియంలో నిర్వహించారు. స్థానికంగా ‘దాడి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ (డైట్‌- అటానమస్‌)’ స్పాన్సర్‌గా వ్యవహరించారు.

రంగవల్లుల హరివిల్లు!

‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’ ముత్యాల ముగ్గుల పోటీలు

ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు, యువతులు

రకరకాల ముగ్గులతో వెల్లివిరిసిన తెలుగు సంప్రదాయం

ఎన్టీఆర్‌ స్టేడియంలో ముందస్తుగానే సంక్రాంతి సందడి

అనకాపల్లి, జనవరి 7 (ఆంధ్రజ్యోతి): సప్తవర్ణాల రంగవల్లులు.. గొబ్బెమ్మలు.. రంగురంగుల పూలతో అలంకరించిన ముత్యాల ముగ్గులతో అనకాపల్లి పట్టణానికి వారం రోజులు ముందుగానే సంక్రాంతి పండుగ వచ్చేసింది. ‘ఏబీఎస్‌-ఆంధ్రజ్యోతి’ ఆదివారం ఇక్కడ నిర్వహించిన ముత్యాల ముగ్గుల పోటీలకు గృహిణులు, యువతుల నుంచి విశేష స్పందన లభించింది. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని ‘ఆంధ్రజ్యోతి- ఏబీఎన్‌’...కెనరా బ్యాంక్‌ ముత్యాల ముగ్గుల పోటీలు...పవర్డ్‌ బై ఎయిమ్స్‌ విద్యా సంస్థలు, బెంగుళూరు...రియల్‌ పార్టనర్‌ స్వర్గసీమ సుకేతన’ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం ఎన్టీఆర్‌ మునిసిపల్‌ స్టేడియంలో నిర్వహించారు. స్థానికంగా ‘దాడి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ (డైట్‌- అటానమస్‌)’ స్పాన్సర్‌గా వ్యవహరించారు. జిల్లా వ్యాప్తంగా పలు మండలాల నుంచి మొత్తం 96 మంది మహిళలు, యువతులు ఈ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. సంక్రాంతి పండుగను ప్రతిబింబించేలా, తెలుగు సంప్రదాయం ఉట్టిపడేలా పలు రకాల ముగ్గులు వేశారు. రకరకాల ముగ్గులతో ఎన్టీఆర్‌ స్టేడియం గ్రామీణ వాతావరణాన్ని తలపించింది. అనంతరం న్యాయనిర్ణేతలు ప్రతీ ముగ్గును నిశితంగా పరిశీలించి, నిబంధనల మేరకు ముగ్గురు విజేతలను ఎంపిక చేశారు. మొదటి బహుమతికి అనకాపల్లి గవరపాలేనికి చెందిన బొదల లక్ష్మి (రూ.6 వేలు), ద్వితీయ బహుమతికి అనకాపల్లికి చెందిన సీహెచ్‌ అన్నపూర్ణ (రూ.4 వేలు), తృతీయ బహుమతికి కశింకోట మండలం బయ్యవరం గ్రామానికి చెందిన కె.యశ్విత (రూ.3 వేలు) ఎంపికయ్యారు. ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా హాజరైన ‘డైట్‌’ చైర్మన్‌ దాడి రత్నాకర్‌, అచ్యుత దంపతులు, జీవీఎంసీ 80వ వార్డు కార్పొరేటర్‌ కొణతాల నీలిమ, భాస్కర్‌ దంపతుల చేతుల మీదుగా నగదు బహుమతులు అందజేశారు. న్యాయ నిర్ణేతలుగా నీలావతి, పద్మజ వ్యవహరించారు. పోటీల్లో పాల్గొన్న వారందరికీ చిరుకానుకలు అందజేశారు. ఈ సందర్భంగా దాడి రత్నాకర్‌ మాట్లాడుతూ, నేటి తరం మహిళలు, యువతులు తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు, సంక్రాంతి పండుగ విశిష్టతను తెలుసుకునే విధంగా ‘ఏబీఎన్‌- ఆంధ్రజ్యోతి’ ఏటా ముగ్గుల పోటీలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు.

మరిన్ని ఫొటోలు, వార్త 7వ పేజీలో...

Updated Date - Jan 08 , 2024 | 01:18 AM