Share News

రైల్వే జోన్‌ భవనం 12 అంతస్థులు

ABN , Publish Date - Nov 26 , 2024 | 12:57 AM

విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటుచేయనున్న దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ ప్రధాన కార్యాలయ భవన నిర్మాణానికి రెండేళ్ల క్రితమే డిజైన్‌ తయారైంది.

రైల్వే జోన్‌ భవనం 12 అంతస్థులు

  • నిర్మాణ వ్యయం అంచనా రూ.154.82 కోట్లు

  • ఓపెన్‌ ఏరియాలో పార్కింగ్‌

  • 290 కార్లు, 645 ద్విచక్ర వాహనాలకు మార్కింగ్‌

  • ఐదో అంతస్థులో జీఎం, డీజీఎం, ఏజీఎంల కార్యాలయాలు

  • భవనం వెలుపల అభివృద్ధి పనులకు రూ.10.17 కోట్లు

  • లాన్‌, ఇంటీరియర్‌, ఫర్నిషింగ్‌లకు రూ.23.5 కోట్లు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటుచేయనున్న దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ ప్రధాన కార్యాలయ భవన నిర్మాణానికి రెండేళ్ల క్రితమే డిజైన్‌ తయారైంది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన సెంట్రల్‌ పబ్లిక్‌ వర్క్స్‌ డిపార్టుమెంట్‌ 2021 ధరల ప్రకారం 12 అంతస్థుల భవన నిర్మాణానికి రూ.154.82 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేసింది. అనేక తర్జనభర్జనల అనంతరం జోనల్‌ కార్యాలయ భవన నిర్మాణాలకు రైల్వే శాఖ టెండర్లను ఆహ్వానించింది. ముడసర్లోవలో జీవీఎంసీ అప్పగించిన భూముల్లోనే జోనల్‌ కార్యాలయం నిర్మితం కానుంది.

రైల్వే జోన్‌ కార్యాలయాన్ని కార్పొరేట్‌ తరహాలో నిర్మించినా పర్యావరణానికి, పచ్చదనానికి ప్రాధాన్యం ఇవ్వనున్నారు. మొత్తం 38.4 మీటర్ల ఎత్తున నిర్మించే భవనంలో 12 అంతస్థులు ఉంటాయి. అందులో రెండు బేస్‌మెంట్లు, ఒకటి గ్రౌండ్‌ ఫ్లోర్‌. రెండు బేస్‌మెంట్లను పూర్తిగా పార్కింగ్‌కు కేటాయించారు. భవనం చుట్టూ ఉండే ఓపెన్‌ ఏరియాలో కూడా వాహనాల పార్కింగ్‌కు అవకాశం కల్పించారు. మొత్తంగా చూసుకుంటే 290 కార్లు, 615 ద్విచక్ర వాహనాలు పార్కింగ్‌ చేసుకోవచ్చు.

గ్రౌండ్‌ ఫ్లోర్‌: బిల్డప్‌ ఏరియా 2,702.83 చ.మీటర్లు. ఇందులో ప్రధాన ప్రవేశ ద్వారం, రియర్‌ లాబీ, ఆడిటోరియం, కంట్రోల్‌రూమ్‌, పురుషులకు, మహిళలకు వేర్వేరుగా గ్రీన్‌ రూమ్‌లు, కిచెన్‌, డైనింగ్‌, సెక్యూరిటీ వింగ్‌, స్టోర్స్‌, బ్యాక్‌ ఆఫీసు ఉంటాయి.

మొదటి అంతస్థు: బిల్డప్‌ ఏరియా 3,222.83 చ.మీ. ఇందులో కమర్షియల్‌ డిపార్టుమెంట్‌, వెల్ఫేర్‌ ఆఫీసు, సీపీఆర్‌ఓ విభాగం, జోనల్‌ ఆఫీసు ఉంటాయి.

రెండో అంతస్థు: బిల్డర్‌ ఏరియా 2,702.83 చ.మీ. ఇందులో ఎఫ్‌ఏఓ, సీఏఓ విభాగం, ఎస్‌ఎస్‌ఈ విభాగం, సేఫ్టీ డిపార్టుమెంట్‌, జోనల్‌ ఆఫీసు, జోనల్‌ కంట్రోల్‌ రూమ్‌, పీఆర్‌ఈఎం రూమ్‌ ఉంటాయి.

మూడో అంతస్థు: బిల్డప్‌ ఏరియా 2,702.83 ఇందులో ఎస్‌డబ్ల్యుఆర్‌ఎసే రూమ్‌, స్టోర్‌ రూమ్‌, కంప్యూటర్‌ రిజర్వేషన్‌, కిచెన్‌ అండ్‌ డైనింగ్‌, టెలీ ఎక్స్ఛేంజ్‌ ఆఫీసు, జోనల్‌ కంట్రోల్‌రూమ్‌, స్పారో రూమ్‌, ప్రీ కాన్ఫరెన్స్‌ రూమ్‌, సమావేశ మందిరం, ఐటీ విభాగం ఉంటాయి.

నాలుగో అంతస్థు: బిల్డప్‌ ఏరియా 2,702.83 చ.మీ. ఇందులో ఫైనాన్స్‌ డిపార్టుమెంట్‌, అకౌంట్స్‌, ఇంజనీరింగ్‌ విభాగాలు, లైబ్రరీ, డిజిటల్‌ లైబ్రరీ ఉంటాయి.

ఐదో అంతస్థు: బిల్డప్‌ ఏరియా 2,702.83 చ.మీ. ఇందులో ఆపరేషన్‌ డిపార్టుమెంట్‌, కిచెన్‌, డైనింగ్‌, స్టోర్‌, స్టాఫ్‌ రూమ్‌, జనరల్‌ మేనేజర్‌ ఆఫీసు, డీజీఎం ఆఫీసు, ఏడీజీఎం ఆఫీసు, మీటింగ్‌ రూమ్‌, సమావేశ మందిరం, జీఎం ఆఫీస్‌ స్టాఫ్‌, జీఎం యాంటీ రూమ్‌, సెక్రటరీ రూమ్‌ ఉంటాయి.

ఆరో అంతస్థు: బిల్డప్‌ ఏరియా 2,702.83 చ.మీ. ఇందులో ఆఫీస్‌ స్పేస్‌, టీ రూమ్‌, ఎస్‌ అండ్‌ టి విభాగం ఉంటాయి.

ఏడో అంతస్థు: 2,702.83 చ.మీ. ఇందులో డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌, సెక్రటరీ, ఏజీఎం, మీటింగ్‌ రూమ్‌, ఎస్‌డీజీఎం రూమ్‌, పాంట్రీ, మెడికల్‌ రూమ్‌ ఉంటాయి.

ఎనిమిదో అంతస్థు: బిల్డప్‌ ఏరియా 2,702.83 చ.మీ. ఇందులో పర్సనల్‌ డిపార్టుమెంట్‌, కిచెన్‌, క్యాంటీన్‌, ఎగ్జిక్యూటివ్‌ డైనింగ్‌, స్టోర్స్‌ ఉంటాయి.

తొమ్మిదో అంతస్థు: బిల్డప్‌ ఏరియా 2,702.83 చ.మీ. ఎలక్ట్రికల్‌, మెకానికల్‌ విభాగాలు, సమావేశ మందిరం, ప్రి కాన్ఫరెన్స్‌ హాలు ఉంటాయి.

- నాలుగు లిఫ్ట్‌లు. ఒక్కో దాంట్లో 13 మంది వెళ్లొచ్చు.

- స్టెయిర్‌ కేసులు 2

నిర్మాణ వ్యయం

కింద బేస్‌మెంట్‌కు రూ.13.53 కోట్లు, అప్పర్‌ బేస్‌మెంట్‌కు రూ.13.45 కోట్లు, గ్రౌండ్‌ ఫ్లోర్‌కు రూ7.32 కోట్లు, మొదటి అంతస్థుకు రూ.8.73 కోట్లు, ఆ తరువాత ప్రతి అంతస్థుకు రూ.7.32 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేశారు.

భవనం వెలుపల అభివృద్ధి పనులకు రూ.10.17 కోట్లు, సీసీ టీవీ కెమెరాలు, లాన్‌, ఇంటీరియన్‌, ఫర్నిషింగ్‌లకు రూ.23.5 కోట్లు అవుతాయని అంచనా వేశారు. మొత్తంగా కలిపి రూ.154.82 కోట్లు వ్యయం అవుతుందని లెక్క తేల్చారు.

Updated Date - Nov 26 , 2024 | 12:57 AM