Share News

రైల్వే అభివృద్ధి పనులు ప్రారంభం

ABN , Publish Date - Feb 27 , 2024 | 12:57 AM

దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్‌ పరిధిలోని అనకాపల్లి జిల్లాలో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం వర్చువల్‌ విధానంలో ప్రారంభించారు.

రైల్వే అభివృద్ధి పనులు ప్రారంభం
ఎలమంచిలి రైల్వే స్టేషన్‌లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న రమణమూర్తిరాజు, పప్పల చలపతిరావు, సుందరపు విజయకుమార్‌

ఎలమంచిలి స్టేషన్‌లో రూ.13.13 కోట్ల పనులకు భూమి పూజ

అందుబాటులోకి ఐదు అండర్‌పాస్‌ వంతెలు

వర్చువల్‌గా ప్రారంభించిన ప్రధాని మోదీ

ఎలమంచిలి, ఫిబ్రవరి 26: దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్‌ పరిధిలోని అనకాపల్లి జిల్లాలో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం వర్చువల్‌ విధానంలో ప్రారంభించారు. ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో రైల్వే అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు. ప్రధాని మోదీ ప్రసంగాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించడానికి ఎల్‌ఈడీ స్ర్కీన్‌లను ఏర్పాటు చేశారు. ఎలమంచిలి రైల్వే స్టేషన్‌లో రూ.13.13 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. ములకలాపల్లి, తురంగలపాలెం వద్ద నిర్మించిన రైల్వే అండర్‌ పాస్‌లను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే యూవీ రమణమూర్తిరాజు, మాజీ ఎమ్మెల్సీ పప్పల చలపతిరావు, జనసేన పార్టీ నియోజకవర్గం ఇన్‌చార్జి సుందరపు విజయ్‌కుమార్‌, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు, అధికార, అనధికార ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, విశాఖలో రైల్వే జోన్‌ ఏర్పాటుకు బీజేపీ నేతలు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డీసీఎం మహ్మద్‌ అలీఖాన్‌, జేఆర్‌సీ మెంబర్‌ శ్రీనివాసరావు, టీడీపీ నియోజకవర్గం ఇన్‌చార్జి ప్రగడ నాగేశ్వరావు, డీసీసీబీ మాజీ చైర్మన్‌ యు.సుకుమారవర్మ, ఎంపీపీ బోదెపు గోవింద్‌, మునిసిపల్‌ వైస్‌ చైర్మన్‌లు బెజవాడ నాగేశ్వరావు, అర్రెపు గుప్తా, తదితరులు పాల్గొన్నారు.

పెదబోదిగల్లం రైల్వే అండర్‌ పాస్‌ ప్రారంభం

నక్కపల్లి, ఫిబ్రవరి 26: మండలంలోని పెదబోదిగల్లం రైల్వే లెవెల్‌ క్రాసింగ్‌ గేటు వద్ద కొత్తగా నిర్మించిన అండర్‌ పాస్‌ను సోమవారం మధ్యాహ్నం దక్షిణ మధ్య రైల్వే ఏపీవో శ్రీనాథ్‌, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఏనుగుపల్లి రత్నం, రాష్ట్ర కాపు కార్పొరేషన్‌ డైరెక్టర్‌ వీసం రామకృష్ణ, జడ్పీటీసీ సభ్యురాలు గోసల కాసులమ్మ, వైస్‌ ఎంపీపీ వీసం నానాజీ, ఎంఈవో కె.నరేశ్‌, హైస్కూల్‌ హెచ్‌ఎం చోడిశెట్టి సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.

పీఎల్‌పురం, నామవరం వద్ద..

పాయకరావుపేట రూరల్‌, ఫిబ్రవరి 26: మండలంలోని పి.ఎల్‌.పురం, నామవరం గ్రామాల వద్ద నిర్మించిన రైల్వే అండర్‌ పాస్‌లను దక్షిణ మధ్య రైల్వే ఏడీఈ (ఆపరేషన్స్‌) సోమవారం పి.ఎల్‌.పురం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, అమృత్‌ భారత్‌ స్టేషన్‌ పథకంలో భాగంగా దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 50 అండర్‌ బ్రిడ్జిలను ప్రధాని మోదీ జాతికి అంకితం చేశారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో కె.స్వప్న, డి.టి. రాజేంద్రప్రసాద్‌, సర్పంచ్‌ పడాల సోమన్నదొర, ఎంపీటీసీ సభ్యురాలు నాగం వెంకటరత్నం, రైల్వే అధికారులు, వైసీపీ, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Feb 27 , 2024 | 12:57 AM