సమస్యలకు సత్వర పరిష్కారం
ABN , Publish Date - Aug 03 , 2024 | 01:15 AM
ప్రజా సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు చేపట్టాలని అధికారులకు జిల్లా కలెక్టర్ ఏఎస్.దినేశ్‌కుమార్ ఆదేశించారు. స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో శుక్రవారం ఐటీడీఏ పీవో వి.అభిషేక్, డీఆర్‌వో బి.పద్మావతితో కలిసిన నిర్వహించిన మీ కోసం కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
కలెక్టర్ ఏఎస్.దినేశ్‌కుమార్ ఆదేశం
మీ కోసంలో 151 వినతులు స్వీకరణ
పాడేరు, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి): cగిరిజనుల నుంచి స్వీకరించిన వినతులను వేగంగా పరిష్కరించేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని, మీ కోసం కార్యక్రమానికి జిల్లా, డివిజన్ స్థాయి అధికారులు హాజరుకావాలన్నారు. గతంలో పెండింగ్‌లో ఉన్న వినతులను పరిష్కరించాలని కలెక్టర్ సూచించారు. రెవెన్యూ శాఖలో 105, ఇరిగేషన్ శాఖలో 6, పంచాయతీరాజ్ 1, డ్వామా 1, గృహ నిర్మాణ శాఖ 1, జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయంలో 4, సోషల్ వెల్ఫేర్‌లో 1, బీసీ వెల్ఫేర్‌లో 1 వినతిని పరిష్కారించాల్సి ఉందన్నారు. ఆయా వినతుల పరిష్కారంలో ఎందుకు జాప్యం జరిగిందని అధికారులను అడిగి తెలుసుకున్నారు.
మీ కోసంలో 151 వినతులు స్వీకరణ
ఐటీడీఏ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన మీ కోసం కార్యక్రమంలో గిరిజనుల నుంచి అధికారులు 151 వినతులను స్వీకరించారు. ప్రముఖ సందర్శనీయ కేంద్రం బొర్రా వద్ద నిలిచిన జిప్‌లైన్ తిరిగి పునరుద్ధరించి స్థానిక సొసైటీకి నిర్వహణ బాధ్యతను అప్పగించాలని ఎంపీటీసీ సభ్యులురాలు కె.అరుణ, సర్పంచ్ జన్ని అప్పారావు, బ్రో సంస్థ అధ్యక్షుడు రవి, పీసా అధ్యక్షుడు దానియేలు తదితరులు కోరారు. అరకులోయ మండలం పెదలబుడు పంచాయతీ బిస్టుంగుడ గ్రామానికి చెందిన కిల్లో చంద్రశేఖర్ పుట్టగొడుగులు పెంపకానికి రూ.3 లక్షలు రుణం మంజూరు చేయాలని కోరగా, పెదబయలు మండలం రూడకోట పంచాయతీ పెదకొండ గ్రామానికి రోడ్డును నిర్మించాలని పాంగి మన్మధరావు, పి.గణపతిరావు కోరారు. అలాగే అనంతగిరి మండలం చిలకలగెడ్డ పంచాయతీ దాసరితోట గ్రామంలో మినీ అంగన్‌వాడీ కేంద్రం ఏర్పాటు చేయాలని స్థానికులు డి.నాగమణి, కె. సీతమ్మ తదితరులు వినతిపత్రం సమర్పించారు. ఇలా గిరిజనుల వ్యక్తిగత, సామాజిక సమస్యలపై 151 వినతులను అధికారులకు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ ఏపీవోలు వీఎస్.ప్రభాకరరావు, వెంకటేశ్వరరావు, జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి డాక్టర్ సి.జమాల్ బాషా, టీడబ్ల్యూ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వీవీఎస్.శర్మ, డీఆర్‌డీఏ పీడీ వి.మురళీ, గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్ శాఖ ఈఈలు డీవీఆర్‌ఎం.రాజు, వేణుగోపాల్, ఐసీడీఎస్ పీడీ ఎన్.సూర్యలక్ష్మి, జిల్లా ఉద్యానవనాధికారి రమేశ్‌కుమార్‌రావు, ట్రాన్స్‌కో ఈఈ అప్పారావు, పశుసంవర్థక శాఖ డీడీ నరసింహులు, వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.