Share News

ఎన్నికల నిర్వహణకు పక్కా ఏర్పాట్లు

ABN , Publish Date - Apr 25 , 2024 | 12:45 AM

జిల్లాలో సార్వత్రిక ఎన్నికలను సజావుగా నిర్వహించాలని, అందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను సక్రమంగా చేయాలని జిల్లా ఎన్నికల(జనరల్‌) పరిశీలకుడు వివేకానందన్‌ ఆదేశించారు. కలెక్టరేట్‌లో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ఎం.విజయసునీత, ఎస్‌పీ తుహిన్‌సిన్హా, పాడేరు, అరకులోయ అసెంబ్లీ స్థానాల రిటర్నింగ్‌ అధికారులు భావన వశిష్ఠ, అభిషేక్‌లతో బుధవారం రాత్రి నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఎన్నికల నిర్వహణకు పక్కా ఏర్పాట్లు
కలెక్టరేట్‌లోని కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ను పరిశీలిస్తున్న ఎన్నికల పరిశీలకుడు వివేకానందన్‌

- జిల్లా ఎన్నికల పరిశీలకుడు వివేకానందన్‌ ఆదేశం

- కలెక్టర్‌, ఎస్‌పీ, పాడేరు, అరకులోయ ఆర్వోలతో భేటీ

పాడేరు, ఏప్రిల్‌ 24(ఆంధ్రజ్యోతి): జిల్లాలో సార్వత్రిక ఎన్నికలను సజావుగా నిర్వహించాలని, అందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను సక్రమంగా చేయాలని జిల్లా ఎన్నికల(జనరల్‌) పరిశీలకుడు వివేకానందన్‌ ఆదేశించారు. కలెక్టరేట్‌లో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ఎం.విజయసునీత, ఎస్‌పీ తుహిన్‌సిన్హా, పాడేరు, అరకులోయ అసెంబ్లీ స్థానాల రిటర్నింగ్‌ అధికారులు భావన వశిష్ఠ, అభిషేక్‌లతో బుధవారం రాత్రి నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన దినసరి కార్యక్రమాల నిర్వహణపై పక్కాగా ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు. షోడో జోన్‌లపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఎన్నికల నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా పటిష్ఠ చర్యలు చేపట్టాలన్నారు. ఎన్నికలను ప్రశాంతంగా, పక్కాగా నిర్వహించేందుకు అధికారులంతా సమన్వయంతో కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి చేసిన ఏర్పాట్లు, తదితర అంశాలపై రూపొందించిన వివరాలను జిల్లా ఎన్నికల అఽధికారి, కలెక్టరి, విజయసునీత పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా ఆయనకు వివరించారు. అనంతరం ఆయన కలెక్టరేట్‌లోని కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో వర్చువల్‌గా రంపచోడవరం అసెంబ్లీ స్థానం రిటర్నింగ్‌ అధికారి ప్రశాంత్‌కుమార్‌, స్థానికంగా జిల్లా రెవెన్యూ అధికారి పద్మావతి, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్లు వీవీఎస్‌ శర్మ, పి.అంబేడ్కర్‌ పాల్గొన్నారు.

ఎన్నికల అంశాలపై సంప్రతించండి

జిల్లాలో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన అంశాలను తనను నేరుగా లేదా ఫోన్‌ ద్వారా ప్రతి రోజు ఉదయం 10 నుంచి 11 గంటలలోపు సంప్రతించవచ్చునని జిల్లా ఎన్నికల పరిశీలకుడు వివేకానందన్‌ తెలిపారు. తాను స్థానిక పీఎంఆర్‌సీ అథితి గృహంలోనే అందుబాటులో ఉంటానని, ప్రత్యక్షంగా కలవాలనుకునే వారు సంప్రతించవచ్చునన్నారు. స్వయంగా కలవలేని వాళ్లు సెల్‌: 9014516237, 9014504385 నంబర్లకు ఫోన్‌ చేయవచ్చునని ఆయన తెలిపారు.

Updated Date - Apr 25 , 2024 | 12:45 AM