Share News

కూటమికే పోస్టల్‌ ఓట్లు అధికం

ABN , Publish Date - Jun 06 , 2024 | 01:26 AM

ఏజెన్సీలోని పాడేరు, అరకులోయ అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు గెలిచినప్పటికీ పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లను పొందడంలో మాత్రం కూటమి అభ్యర్థులు ముందున్నారు. పాడేరులో టీడీపీ అభ్యర్థి గిడ్డి ఈశ్వరికి 1,365, అరకులోయలో బీజేపీ అభ్యర్థి పాంగి రాజారావుకు 848 పోస్టల్‌ ఓట్లు వచ్చాయి. అంటే వైపీసీ ప్రభుత్వంపై ప్రభుత్వ ఉద్యోగులకు ఉన్న వ్యతిరేకతను ఇలా ప్రదర్శించారని స్పష్టమవుతున్నది.

కూటమికే పోస్టల్‌ ఓట్లు అధికం
పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లను లెక్కింపును పరిశీలిస్తున్న అరకులోయ ఆర్వో అభిషేక్‌

- పాడేరులో టీడీపీకి 1,365, అరకులోయలో బీజేపీకి 848 ఓట్లు

- కూటమికి ఓట్లేసి ప్రభుత్వంపై వ్యతిరేకతను చాటుకున్న ఉద్యోగులు

పాడేరు, జూన్‌ 5(ఆంరఽధజ్యోతి): ఏజెన్సీలోని పాడేరు, అరకులోయ అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు గెలిచినప్పటికీ పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లను పొందడంలో మాత్రం కూటమి అభ్యర్థులు ముందున్నారు. పాడేరులో టీడీపీ అభ్యర్థి గిడ్డి ఈశ్వరికి 1,365, అరకులోయలో బీజేపీ అభ్యర్థి పాంగి రాజారావుకు 848 పోస్టల్‌ ఓట్లు వచ్చాయి. అంటే వైపీసీ ప్రభుత్వంపై ప్రభుత్వ ఉద్యోగులకు ఉన్న వ్యతిరేకతను ఇలా ప్రదర్శించారని స్పష్టమవుతున్నది.

పాడేరులో వైసీపీకి కంటే టీడీపీకే అధికం

పాడేరు నియోజవర్గంలో వైసీపీ అభ్యర్థి కంటే టీడీపీ అభ్యర్థికే పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు అఽధికంగా పడ్డాయి. మొత్తం 2,897 పోస్టల్‌ ఓట్లకు గానూ... మత్స్యరాస విశ్వేశ్వరరాజు(వైసీపీ) 837, గిడ్డి ఈశ్వరి(టీడీపీ) 1364, వంతాల సుబ్బారావు(స్వతంత్ర) 42, సతకా బుల్లిబాబు(కాంగ్రెస్‌) 295, సుర్ల అప్పారావు(బీఎస్‌పీ) 27, కింటుకూరి జోసెఫ్‌(ఇండియా ప్రజాబందు పార్టీ) 5, మినుముల రాంబాబు(సమాజ్‌ వాదీ పార్టీ) 0, కిల్లో రంగారావు(భారత చైతన్య పార్టీ) 4, దమంతి నాగేశ్వరరావు(జైభారత్‌ నేషనల్‌ పార్టీ) 1, బొంకు అర్జునరావు(జై మహాభారత్‌ పార్టీ) 11, వల్లా మౌనిక (స్వతంత్ర) 5, అడపా విష్ణుమూర్తి(స్వతంత్ర) 1, ఎస్‌.శంకరరావు (స్వతంత్ర) 169, చెర్రెకి ఎంప్రైయంబాబు (స్వతంత్ర) 3, డొంకాడ శివప్రసాద్‌ (స్వతంత్ర) 2, కొక్కుల కన్నబాబు(స్వతంత్ర): 18, నోటాకు 12 ఓట్లు పడగా, 101 ఓట్లు తిరస్కరణకు గురయ్యాయి.

అరకులోయలో కూటమి అభ్యర్థికి 848 పోస్టల్‌ ఓట్లు

అరకులోయ అసెంబ్లీ స్థానంలో కూటమి అభ్యర్థికే అందరి కంటే అత్యధికంగా పోస్టల్‌ ఓట్లు పడ్డాయి. వాటిని పరిశీలిస్తే.... మొత్తం 3,540 ఓట్లకు గానూ పాంగి రాజారావు(బీజేపీ)కు 848, రేగం మత్స్యలింగం(వైసీపీ)కి 675, శెట్టి గంగాధరస్వామి(కాంగ్రెస్‌)కు 608, అభ్యర్థి లకే రాజారావు(బీఎస్‌పీ) 682, కిల్లో అనిల్‌కుమార్‌(లిబరేషన్‌ కాంగ్రెస్‌ పార్టీ) 3, చుంచు రాజుబాబు(గొండ్యాన దండకారణ్య పార్టీ) 8, బురిడి ఉపేంద్ర(జై భారత్‌ జాతీయ పార్టీ) 0, పుచ్చపుండి రామకృష్ణ(భారత్‌ ఆదివాసీ పార్టీ) 6, సివేరి అబ్రహం(స్వతంత్ర) 265, చెండా ఏలియా (స్వతంత్ర) 84, కమ్మిడి నిర్మల (స్వతంత్ర) 7, గెమ్మిలి కృష్ణారావు (స్వతంత్ర) 2, నారాజీ మధుబాబు (స్వతంత్ర) 3, మొస్యా సుజాత (స్వతంత్ర) 12, సమర్డి రఘనాధ్‌ (స్వతంత్ర) 182, వంతల రామన్న (స్వతంత్ర) 61, సమర్డి భవానీ (స్వతంత్ర) 20, నోటాకు 26 పోస్టల్‌ ఓట్లు పడగా, 38 ఓట్లు తిరస్కరణకు గురయ్యాయి.

Updated Date - Jun 06 , 2024 | 01:26 AM