Share News

దర్జాగా ప్రభుత్వ భూముల కబ్జా

ABN , Publish Date - Jun 17 , 2024 | 01:09 AM

జీవీఎంసీ 88వ వార్డు పరిధిలోని వెదుళ్ల నరవ గ్రామంలో ప్రభుత్వ భూములు కబ్జాకు గురవుతున్నాయి. అక్రమార్కులు ప్రభుత్వ భూములను ఆక్రమించి దర్జాగా ప్రహరీ గోడలు నిర్మించేస్తున్నారు. వాటిని ప్లాట్లుకు విభజించి విక్రయించేస్తున్నారు. స్థానికులు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది.

దర్జాగా ప్రభుత్వ భూముల కబ్జా

నకిలీ ఎల్‌పీసీలతో విక్రయాలు

- బరి తెగించిన అక్రమార్కులు

- పట్టించుకోని అధికారులు

సబ్బవరం, జూన్‌ 16: జీవీఎంసీ 88వ వార్డు పరిధిలోని వెదుళ్ల నరవ గ్రామంలో ప్రభుత్వ భూములు కబ్జాకు గురవుతున్నాయి. అక్రమార్కులు ప్రభుత్వ భూములను ఆక్రమించి దర్జాగా ప్రహరీ గోడలు నిర్మించేస్తున్నారు. వాటిని ప్లాట్లుకు విభజించి విక్రయించేస్తున్నారు. స్థానికులు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది.

వెదుళ్ల నరవ సర్వే నంబరు 113లో ప్రభుత్వ భూమి 1.85 ఎకరాలు ఉంది. ఇది గెడ్డ, అయితే కొంత స్థలానికి నకిలీ ఎల్‌పీసీ(ల్యాండ్‌ పొజిషన్‌ సర్టిఫికెట్‌)లు సృష్టించి స్థానిక నేతల సహకారంతో కొంత మంది అమ్మేస్తుంటే, మరి కొంత స్థలంలో ప్లాట్లు వేసి పక్కా జిరాయితీ నంబరుతో సెంటు రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షలకు దర్జాగా విక్రయించేస్తున్నారు. అదే విధంగా సర్వే నంబర్లు 117, 116లలో ప్రభుత్వ భూములను స్థానిక నేతలు యథేచ్ఛగా ఆక్రమించి ప్రహరీ గోడలు నిర్మించి అమ్మకానికి సిద్ధం చేశారు. కాగా సర్వే నంబరు 121లోని ప్రభుత్వ స్థలంలో ఇటీవల పక్కా భవనం నిర్మిస్తుంటే ఫిర్యాదు చేసినా జీవీఎంసీ టౌన్‌ ప్లానింగ్‌, రెవెన్యూ అధికారులు పట్టించుకోలేదని స్థానికులు చెబుతున్నారు. ఉన్నతాధికారులు ఇప్పటికైనా స్పందించి అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

Updated Date - Jun 17 , 2024 | 01:09 AM