Share News

వివేకానంద కాలనీలో క్షీణించిన పారిశుధ్యం

ABN , Publish Date - Jun 10 , 2024 | 11:49 PM

మండలంలోని ధర్మవరం అగ్రహారం గ్రామంలో ఉన్న వివేకానంద కాలనీలో పారిశుధ్యం క్షీణించింది.

వివేకానంద కాలనీలో క్షీణించిన పారిశుధ్యం
వివేకానంద కాలనీలో నిలిచిన మురుగు నీటిని పరిశీలిస్తున్న అప్పలరాజు

ఎస్‌.రాయవరం, జూన్‌ 10: మండలంలోని ధర్మవరం అగ్రహారం గ్రామంలో ఉన్న వివేకానంద కాలనీలో పారిశుధ్యం క్షీణించింది. కాలనీలో మురుగు నీరు ఎక్కడికక్కడ నిలిచి పోవడంతో తీవ్ర దుర్గంధం వెదజల్లుతోంది. ఈ మురుగు నీరు వలన స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్న విషయాన్ని తెలుసుకున్న సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు ఎం. అప్పలరాజు సోమవారం వివేకానంద కాలనీని సందర్శించారు. అనం తరం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. కాలనీలో మురుగు కాలువలు జామ్‌ అయిపోవడంతో నీరు బయటకు వెళ్లడం లేద న్నారు. దీంతో దోమలు వృద్ధి చెంది స్థానికులకు నిద్ర పట్టకుండా చేస్తున్నాయన్నారు. వెంటనే అధికారులు స్పందించి మురుగు కాలువలను శుభ్రం చేయించి, మురుగు నీరు బయటకు వెళ్లేలా చర్యలు తీసుకోవాలని అప్పలరాజు డిమాండ్‌ చేశారు.

Updated Date - Jun 10 , 2024 | 11:49 PM