Share News

పాలీ సెట్‌ కౌన్సెలింగ్‌ ప్రారంభం

ABN , Publish Date - May 27 , 2024 | 11:21 PM

పాలిటెక్నిక్‌ కళాశాలల్లో ప్రవేశాలకు అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ సోమవారం ప్రారంభమైంది. మండలంలోని రేబాకలో గల ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో మొదటి రోజు కళాశాల ప్రిన్సిపాల్‌ ఐవీఎస్‌ఎస్‌ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈ కౌన్సెలింగ్‌ ప్రక్రియను ప్రారంభించారు.

పాలీ సెట్‌ కౌన్సెలింగ్‌ ప్రారంభం
కౌన్సెలింగ్‌ నిర్వహించిన విద్యార్థినికి ఐసీఆర్‌ పత్రాన్ని అందిస్తున్న దృశ్యం

అనకాపల్లి రూరల్‌, మే 27: పాలిటెక్నిక్‌ కళాశాలల్లో ప్రవేశాలకు అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ సోమవారం ప్రారంభమైంది. మండలంలోని రేబాకలో గల ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో మొదటి రోజు కళాశాల ప్రిన్సిపాల్‌ ఐవీఎస్‌ఎస్‌ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈ కౌన్సెలింగ్‌ ప్రక్రియను ప్రారంభించారు. ఒకటో ర్యాంకు నుంచి 12 వేల ర్యాంకు వరకు తొలి రోజు కౌన్సెలింగ్‌ నిర్వహించారు. 99 మంది విద్యార్థుల ధ్రువపత్రాలను పరిశీలించి ఐసీఆర్‌ పత్రాలను అందజేశారు. బాలురు 56 మంది, బాలికలు 43 మంది హాజరయ్యారు. మంగళవారం 12,001వ ర్యాంకు నుంచి 27 వేల ర్యాంకు వరకు కౌన్సెలింగ్‌ నిర్వహిస్తామని ఆయన తెలిపారు. ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కౌన్సెలింగ్‌ ప్రక్రియ కొనసాగుతుందన్నారు.

Updated Date - May 27 , 2024 | 11:21 PM