Share News

ప్రశాంతంగా పాలిసెట్‌

ABN , Publish Date - Apr 28 , 2024 | 02:06 AM

జిల్లావ్యాప్తంగా శనివారం నిర్వహించిన పాలిసెట్‌ ప్రశాంతంగా ముగిసింది.

ప్రశాంతంగా పాలిసెట్‌

  • జిల్లావ్యాప్తంగా 12147 మంది హాజరు

కంచరపాలెం, ఏప్రిల్‌ 27:

జిల్లావ్యాప్తంగా శనివారం నిర్వహించిన పాలిసెట్‌ ప్రశాంతంగా ముగిసింది. విశాఖ నగరం, పెందుర్తి, భీమిలి మూడు డివిజన్‌లలోని 28 కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహించారు. జిల్లా నుంచి 13021 విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, శనివారం జరిగిన పరీక్షకు 12,147 మంది (93.3ు) హాజరయ్యారు. వీరిలో 7,268 బాలురు, 4,879 బాలికలు ఉన్నారు. 874 మంది గైర్హాజరయ్యారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా సజావుగా పరీక్ష పూర్తయినట్టు పాలిసెట్‌ జిల్లా కో-ఆర్డినేటర్‌ డా.కె.నారాయణరావు పేర్కొన్నారు. కాగా, సాంకేతిక శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ కె.విజయభాస్కర్‌ నగరంలోని పలు పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. అధికారులకు పలు సూచనలు చేశారు.

Updated Date - Apr 28 , 2024 | 09:11 AM