Share News

బీజేపీలో పరుచూరి భాస్కరరావు చేరిక

ABN , Publish Date - Apr 05 , 2024 | 12:45 AM

బీజేపీ అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్‌ సమక్షంలో పరుచూరి భాస్కరరావు ఆ పార్టీలో చేరారు. అనకాపల్లిలోని ఆ పార్టీ కార్యాలయంలో భాస్కరరావుతో పాటు పలువురికి సీఎం రమేశ్‌ పార్టీ కండువా చేసి బీజేపీలోకి ఆహ్వానించారు.

బీజేపీలో పరుచూరి భాస్కరరావు చేరిక
బీజేపీలో పరుచూరి భాస్కరరావు చేరిక

కొత్తూరు, ఏప్రిల్‌ 4: బీజేపీ అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్‌ సమక్షంలో పరుచూరి భాస్కరరావు ఆ పార్టీలో చేరారు. అనకాపల్లిలోని ఆ పార్టీ కార్యాలయంలో భాస్కరరావుతో పాటు పలువురికి సీఎం రమేశ్‌ పార్టీ కండువా చేసి బీజేపీలోకి ఆహ్వానించారు. జనసేనలో టికెట్‌ రాలేదని పరిచూరి భాస్కరరావు ఆ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. కాగా బీజేపీలో చేరిన అనంతరం భాస్కరరావు మాట్లాడుతూ సీఎం రమేశ్‌ గెలుపునకు కృషి చేస్తానని చెప్పారు.

Updated Date - Apr 05 , 2024 | 12:45 AM