Share News

అనారోగ్యంతో తల్లిదండ్రులు మృతి

ABN , Publish Date - Jun 12 , 2024 | 12:48 AM

తండ్రి అనారోగ్యంతో ఇంటి వద్దే ఉండేవాడు. తల్లి కూలి పని చేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకు వచ్చేది. పిల్లలు ఇద్దరు ప్రభుత్వ పాఠశాల్లో చదువుకునేవారు. మూడు నెలల క్రితం అనారోగ్యంతో ఉన్న తండ్రి చనిపోయాడు. దీంతో మనోవేదనకు గురై అనారోగ్యం పాలైన తల్లి కూడా ఈనెలలో మృతి చెందింది. దీంతో ఆ ఇద్దరు చిన్నారులు అనాథలయ్యారు.

అనారోగ్యంతో తల్లిదండ్రులు మృతి
తల్లిదండ్రులు మృతి చెందడంతో అనాథలుగా మారిన చిన్నారులు

వారిని సాకుతున్న గొల్లలపాలెం గ్రామస్థులు

ఆపన్నహస్తం కోసం చిన్నారులు ఎదురుచూపు

సబ్బవరం, జూన్‌ 11 : తండ్రి అనారోగ్యంతో ఇంటి వద్దే ఉండేవాడు. తల్లి కూలి పని చేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకు వచ్చేది. పిల్లలు ఇద్దరు ప్రభుత్వ పాఠశాల్లో చదువుకునేవారు. మూడు నెలల క్రితం అనారోగ్యంతో ఉన్న తండ్రి చనిపోయాడు. దీంతో మనోవేదనకు గురై అనారోగ్యం పాలైన తల్లి కూడా ఈనెలలో మృతి చెందింది. దీంతో ఆ ఇద్దరు చిన్నారులు అనాథలయ్యారు. తల్లిదండ్రులు మృతి చెంది అనాథలైన ఆ చిన్నారులు ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్నారు. వివరాలిలా ఉన్నాయి.

అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం గొల్లలపాలెం ఎస్సీ కాలనీలో చందా నూకరాజు (35), కనకమ్మ (30) భార్యాభర్తలు. వీరికి పవన్‌కుమార్‌, అర్జున్‌ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. నూకరాజు అనారోగ్యంతో ఇంటి పట్టునే ఉండేవాడు. భర్త, ఇద్దరి పిల్లలను కనకమ్మ కూలి పని, పాచి పని చేస్తూ సాకేది. వీరి కుటుంబం సాఫీగా సాగుతుండగా మూడు నెలల క్రితం భర్త నూకరాజు మృతి చెందాడు. భర్త మృతి చెందినప్పటి నుంచి కనకమ్మ మనోవేదనకు గురైంది. పిల్లల గురించి దిగులు చెందుతూ.. అనారోగ్యం పాలైంది. ఆమె ఈనెల ఒకటో తేదీన మృతి చెందింది. గ్రామస్థులు ఆమెకు అంత్యక్రియలు చేశారు. తల్లిదండ్రులు మృతితో ఆ చిన్నారులు ఇద్దరు అనాఽథలయ్యారు. పెద్ద కుమారుడు పవన్‌కుమార్‌ ప్రస్తుతం సబ్బవరం గురుకుల పాఠశాలలో పదో తరగతి, చిన్నకుమారుడు అర్జున్‌ నంగినారపాడు జడ్పీ హైస్కూల్లో ఏదో తరగతి చదువుతున్నారు. ప్రస్తుతం ఆ పిల్లల ఆలనా పాలనా చూసే పెద్ద దిక్కు ఎవరూ లేకుండా పోయారు. గ్రామస్థులు ప్రస్తుతం ఆ పిల్లలను సాకుతున్నారు. ఆ పిల్లల్ని ఎవరైన ధాతలు కానీ, ప్రభుత్వం కానీ ఆదుకోవాలని గొల్లలపాలెం గ్రామస్థులు కోరుతున్నారు.

Updated Date - Jun 12 , 2024 | 12:48 AM