గండి బాబ్జీని పరామర్శించిన పంచకర్ల
ABN , Publish Date - May 25 , 2024 | 12:02 AM
మాజీ ఎమ్మెల్యే, టీడీపీ పెందుర్తి ఇన్‌చార్జి గండి బాబ్జీని మొగలిపురంలో శుక్రవారం జనసేన పెందుర్తి ఎమ్మెల్యే అభ్యర్థి పంచకర్ల రమేశ్‌బాబు పార్టీ శ్రేణులతో కలిసి పరామర్శించారు.
సబ్బవరం, మే 24 : మాజీ ఎమ్మెల్యే, టీడీపీ పెందుర్తి ఇన్‌చార్జి గండి బాబ్జీని మొగలిపురంలో శుక్రవారం జనసేన పెందుర్తి ఎమ్మెల్యే అభ్యర్థి పంచకర్ల రమేశ్‌బాబు పార్టీ శ్రేణులతో కలిసి పరామర్శించారు. ఇటీవల అనారోగ్యం బారిన పడి బాబ్జీ ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన్ని పంచకర్ల పరామర్శించి, ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికలు, పోలింగ్ సరళి తదితర రాజకీయ అంశాలపై చర్చించుకున్నారు. పంచకర్ల వెంట కార్పొరేటర్ మొల్లి ముత్యాలనాయుడు, కూటమి నేతలు ఎం .మహలక్ష్మీనాయుడు, గండి దేముడు, కొత్తూరు గెడ్డప్ప, గజ్జి నరసింగరావు తదితరులు ఉన్నారు.