Share News

రోడ్డు ప్రమాదంలో ఒకరి దుర్మరణం

ABN , Publish Date - Mar 18 , 2024 | 12:24 AM

రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ప్రమాదం ఆదివారం వేకువజామున జరిగింది. దీనికి సంబంధించి స్థానిక ఇన్‌చార్జి ఎస్‌ఐ లక్ష్మణరావు తెలిపిన వివరాలు ఇలా వున్నాయి.

రోడ్డు ప్రమాదంలో ఒకరి దుర్మరణం
లవకుశ మృతదేహం

విశాఖలో కాంగ్రెస్‌ బహిరంగ సభకు వెళ్లి వస్తుండగా ఘటన

పెదబయలు, మార్చి 17: రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ప్రమాదం ఆదివారం వేకువజామున జరిగింది. దీనికి సంబంధించి స్థానిక ఇన్‌చార్జి ఎస్‌ఐ లక్ష్మణరావు తెలిపిన వివరాలు ఇలా వున్నాయి. ముంచంగిపుట్టు మండలం బరడా పంచాయతీ బొడ్డపుట్టు గ్రామం నుంచి వ్యాన్‌లో ఐదుగురు వ్యక్తులు శనివారం రాత్రి విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్‌ వద్ద జరిగిన కాంగ్రెస్‌ పార్టీ భారీ బహిరంగ సభ కు వెళ్లారు. సభ ముగిసిన తరువాత తిరుగుప్రయాణమయ్యారు. ఆదివారం వేకువజామున పెదబయలు మండలం అరడకోట పంచాయతీ చెరువువీధి గ్రామ జంక్షన్‌ వద్ద వచ్చే సరికి వ్యాన్‌ బోల్తా పడింది. దీంతో వ్యాన్‌లో ఉన్నవారిలో నలుగురికి స్వల్ప గాయాలు కాగా, వంతాల లవకుశ(51)కు తీవ్ర గాయాలయ్యాయి. అతనిని 108 వాహనంలో పాడేరు జిల్లా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. పాడేరు జిల్లా ఆస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించామని ఎస్‌ఐ తెలిపారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఆయన చెప్పారు.

Updated Date - Mar 18 , 2024 | 12:24 AM