Share News

తొలి రోజు 95.44 శాతం పింఛన్ల పంపిణీ

ABN , Publish Date - Dec 31 , 2024 | 11:25 PM

జిల్లాలో తొలి రోజైన మంగళవారం 95.44 శాతం మందికి సామాజిక పింఛన్లు పంపిణీ చేశారు. జిల్లా వ్యాప్తంగా 1.23,679 మంది లబ్ధిదారులు ఉండగా, రూ.51 కోట్ల 78 లక్షల 50వేల 500 నిధులను ప్రభుత్వం విడుదల చేసిన విషయం తెలిసిందే.

తొలి రోజు 95.44 శాతం పింఛన్ల పంపిణీ
హుకుంపేట మండలం గడుగుపల్లిలో వృద్ధురాలికి పింఛన్‌ సొమ్ము అందిస్తున్న కలెక్టర్‌ ఏఎస్‌ దినేశ్‌కుమార్‌

జిల్లాలో మొత్తం లబ్ధిదారులు 1,23,679 మంది

ఒక్క రోజే 1,18,036 మందికి అందజేత

పాడేరు, డిసెంబరు 31(ఆంధ్రజ్యోతి): జిల్లాలో తొలి రోజైన మంగళవారం 95.44 శాతం మందికి సామాజిక పింఛన్లు పంపిణీ చేశారు. జిల్లా వ్యాప్తంగా 1.23,679 మంది లబ్ధిదారులు ఉండగా, రూ.51 కోట్ల 78 లక్షల 50వేల 500 నిధులను ప్రభుత్వం విడుదల చేసిన విషయం తెలిసిందే. కాగా తొలి రోజు రాత్రి 8 గంటల్లోగా 1,18,036 మందికి రూ.49 కోట్ల 32 లక్షల 62 వేల 500 పింఛన్‌ సొమ్మును అందించారు. ఇంకా 5,643 మందికి అందించాల్సి ఉంది. దీంతో జిల్లాలో తొలి రోజు పెన్షన్ల పంపిణీ 95.44 శాతంగా నమోదైంది. ఏదైనా కారణంతో మంగళవారం పెన్షన్‌ పొందని లబ్ధిదారులకు బుధవారం విధిగా అందిస్తామని డీఆర్‌డీఏ అధికారులు తెలిపారు.

హుకుంపేటలో కలెక్టర్‌ పంపిణీ

హుకుంపేట మండలంలో తాడిపుట్టు, గడుగుపల్లిలో డీఆర్‌డీఏ పీడీ వి.మురళితో కలిసి పలువురు లబ్ధిదారులకు మంగళవారం పెన్షన్‌ సొమ్మును అందించి జిల్లాలోని సామాజిక పెన్షన్ల పంపిణీ ప్రక్రియను కలెక్టర్‌ ఏఎస్‌ దినేశ్‌కుమార్‌ లాంఛనంగా ప్రారంభించారు. అనంతగిరి మండలంలో జీసీసీ చైర్మన్‌ కిడారి శ్రావణ్‌కుమార్‌, పాడేరులో టీడీపీ పాడేరు నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, రంపచోడవరంలో ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి పింఛన్ల పంపిణీ ప్రక్రియలో పాల్గొన్నారు. అలాగే జిల్లాలో వివిధ ప్రాంతాల్లోని పెన్షన్ల పంపిణీలో కూటమి నేతలు పాల్గొన్నారు.

Updated Date - Dec 31 , 2024 | 11:25 PM