Share News

ఎన్నికల విధుల్లో వలంటీర్లు వద్దు

ABN , Publish Date - Feb 06 , 2024 | 11:34 PM

రానున్న ఎన్నికల్లో గ్రామ/ వార్డు వలంటీర్లను వైసీపీ తరుపున వినియోగించుకోవాలనుకోవడం సరికాదని టీడీపీ జిల్లా అధ్యక్షుడు బుద్ద నాగజగదీశ్వరరావు అన్నారు.

ఎన్నికల విధుల్లో వలంటీర్లు వద్దు
బుద్ద నాగజగదీశ్వరరావు

టీడీపీ జిల్లా అధ్యక్షుడు నాగజగదీశ్‌

అనకాపల్లి, పిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి): రానున్న ఎన్నికల్లో గ్రామ/ వార్డు వలంటీర్లను వైసీపీ తరుపున వినియోగించుకోవాలనుకోవడం సరికాదని టీడీపీ జిల్లా అధ్యక్షుడు బుద్ద నాగజగదీశ్వరరావు అన్నారు. ప్రజలు పన్నుల రూపంలో చెల్లించిన డబ్బు నుంచి వలంటీర్లకు జీతాలు చెల్తిస్తున్నారని, అటువంటి వలంటీర్లు వచ్చే ఎన్నికల్లో వైసీపీ అండగా వుండాలని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి పిలుపునివ్వడం సిగ్గు చేటన్నారు. వలంటీర్లను ఎన్నికల విధుల్లో ఎక్కడా ఉపయోగించవద్దని ఎన్నికల సంఘం స్పష్టం చేసినప్పటికీ, వైసీపీ పాలకులు స్థానిక అధికారులపై ఒత్తిడి తెచ్చి వలంటీర్లతోనే ఓటర్ల జాబితాల సవరణ చేయించారని ఆయన ఆరోపించారు. వలంటీర్లను ఎన్నికల విధులు విధులు అప్పగిస్తే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని నాగజగదీశ్‌ స్పష్టం చేశారు.

Updated Date - Feb 06 , 2024 | 11:34 PM