Share News

నూ ఇయర్‌ జోష్‌

ABN , Publish Date - Jan 01 , 2024 | 12:58 AM

అనకాపల్లికి నూతన సంవత్సర శోభ సంతరించుకుంది. అర్ధరాత్రి 12 గంటలకు 2023వ సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ, 2024వ సంవత్సరాన్ని ఆనందోత్సాహాలతో ఆహ్వానించారు. పలుచోట్ల పెద్ద ఎత్తున బాణసంచా కాల్చారు.

నూ ఇయర్‌ జోష్‌
అనకాపల్లిలో బొకేల దుకాణం వద్ద కొనుగోలుదారులు

కొత్త సంవత్సరానికి ఘనంగా స్వాగతం

వీధుల్లో సందడి చేసిన యువత

బేకరీలు, పూలు, పండ్ల దుకాణాల వద్ద రద్దీ

అనకాపల్లి టౌన్‌, డిసెంబరు 31: అనకాపల్లికి నూతన సంవత్సర శోభ సంతరించుకుంది. అర్ధరాత్రి 12 గంటలకు 2023వ సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ, 2024వ సంవత్సరాన్ని ఆనందోత్సాహాలతో ఆహ్వానించారు. పలుచోట్ల పెద్ద ఎత్తున బాణసంచా కాల్చారు. కేకులు కట్‌ చేసి మిఠాయిలు పంచుకున్నారు. యువకులు బైక్‌లపై తిరుగుతూ సందడి చేశారు. కాగా నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఇళ్ల ముందు రంగులతో ముగ్గులు వేశారు. కిందిస్థాయి ఉద్యోగులు తమ పైఅధికారులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలపడానికి పండ్లు, పూల బొకేలు, కేకులు, మిఠాయిలు కొనుగోలు చేశారు. దీంతో ఎప్పటిమాదిరిగానే వీటి ధరలు పెరిగాయి. నాలుగు పండ్లు యాపిల్‌ రూ.100 నుంచి రూ.125కి, కమలాపండ్లు నాలుగు పండ్లు రూ.50 నుంచి రూ.60కి విక్రయించారు. కొన్ని హోటళ్లు, రెస్టారెంట్లలో బిర్యానీ, పలు రకాల మాంసాహారాలను ఆఫర్లపై విక్రయించారు. దుకాణాలను విద్యుద్దీపాలతో అలంకరించారు. కాగా స్మార్ట్‌ఫోన్లు అందుబాటులోకి వచ్చిన తరువాత గ్రీటింగ్‌ కార్డుల అమ్మకాలు బాగా తగ్గిపోయాయి.

ఫొటోరైటప్‌: 31 ఎండీఎల్‌ఆర్‌ 1: పెన్సిల్‌ ముల్లుపై గోపాల్‌ చెక్కిన 2024

ఫొటోః31ఎన్‌కేపీ4:పెన్సిల్‌ ముల్లుపై వెంకటేశ్‌ చెక్కిన 2024

గోపాల్‌: సూక్ష కళాకారుడు నైదండ గోపాల్‌

ప్రతిభ చాటిన సూక్ష కళాకారులు

పెన్సిల్‌ ముల్లుపై కొత్త సంవత్సరం

మాడుగుల రూరల్‌/ నక్కపల్లి, డిసెంబరు 31 : నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని సూక్ష కళాకారులు మరోసారి తమలోని ప్రతిభను చాటిచెప్పారు. మాడుగుల మండలం మండలం ఎం.కోడూరు గ్రామానికి చెందిన సూక్ష కళాకారుడు నైదండ గోపాల్‌ పెన్సిల్‌ ముల్లుపై ‘2024’ చెక్కి కొత్త సంవత్సరానికి స్వాగతం పలికాడు. ప్రత్యేక దినాల్లో గోపాల్‌ తన కళా నైపుణ్యంతో సూక్ష్మ కళాఖండాలు తయారు చేస్తుంటాడు. పెన్సిల్‌ ముల్లుపై ‘2024’ అంకెలను చెక్కడానికి సుమారు రెండు గంటల సమయం పట్టిందని గోపాల్‌ వెల్లడించాడు. కాగా నక్కపల్లి మండలం చినదొడ్డిగల్లు గ్రామానికి చెందిన సూక్ష్మ కళాకారుడు గట్టెం వెంకటేశ్‌ తన కళానైపుణ్యంతో పెన్సిల్‌ ముల్లుపై 2024 అంకెలను అద్భుతంగా చెక్కాడు. 12 మి.మీ.ల ఎత్తు, 6 మి.మీ వెడల్పున ఈ అంకెలు చెక్కడానికి నాలుగు గంటలు పట్టిందన్నాడు.

Updated Date - Jan 01 , 2024 | 12:59 AM