Share News

ఆర్టీసీ కాంప్లెక్స్‌ కిటకిట

ABN , Publish Date - Jan 09 , 2024 | 01:07 AM

విద్యా సంస్థలకు ఈ నెల 9వ తేదీ నుంచి 18వ తేదీ వరకు సంక్రాంతి పండగ సెలవులు ప్రకటించడంతో ఆశ్రమ పాఠశాలలు, గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులు సోమవారం ఇళ్లకు బయలుదేరారు.

ఆర్టీసీ కాంప్లెక్స్‌ కిటకిట
ప్రయాణికులతో రద్దీగా వున్న ఆర్టీసీ కాంప్లెక్స్‌

విద్యా సంస్థలకు సంక్రాంతి సెలవులు

ఇళ్లకు వెళ్లడానికి బస్సులు, జీపులు, ఆటోలను ఆశ్రయించి విద్యార్థులు

పాడేరురూరల్‌, జనవరి 8: విద్యా సంస్థలకు ఈ నెల 9వ తేదీ నుంచి 18వ తేదీ వరకు సంక్రాంతి పండగ సెలవులు ప్రకటించడంతో ఆశ్రమ పాఠశాలలు, గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులు సోమవారం ఇళ్లకు బయలుదేరారు. పదేళ్ల లోపు పిల్లలను ఇళ్లకు తీసుకెళ్లడానికి తల్లిదండ్రులు ఆయా పాఠశాలలకు వచ్చారు. దుస్తులు, పుస్తకాల బ్యాగులతో వసతిగృహాల నుంచి బయలుదేరి సొంతూళ్లకు వెళ్లడానికి ఆర్టీసీ బస్సులు, ఆటోలు, జీపులను ఆశ్రయించారు. దూరప్రాంతాలకు వెళ్లాల్సిన విద్యార్థులు బస్సుల్లో వెళ్లడానికి స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్‌కు చేరుకున్నారు. దీంతో మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు ఆర్టీసీ కాంప్లెక్స్‌ ప్రయాణికులతో రద్దీగా మారింది. బస్సు వస్తేచాలు.. ఎక్కడానికి ఎగబడుతున్నారు. కాగా సరిపడ బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు గంటల తరబడి నిరీక్షించారు.

Updated Date - Jan 09 , 2024 | 01:07 AM