Share News

ఎన్నికలకు నగారా

ABN , Publish Date - Apr 18 , 2024 | 01:24 AM

సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో మరో ఘట్టం ప్రారంభం కానున్నది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నుంచి గురువారం నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. ఎన్నికల కమిషన్‌ గతంలో విడుదల చేసిన షెడ్యూల్‌, ఆదేశాల మేరకు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ రవి పట్టన్‌శెట్టి ఆధ్వర్యంలో నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు పూర్తిచేశారు.

ఎన్నికలకు నగారా

నేడు నోటిఫికేషన్‌ జారీ

ఉదయం 11 గంటల నుంచి నామినేషన్లు స్వీకరణ

అనకాపల్లి ఎంపీ స్థానానికి కలెక్టర్‌లో..

పాయకరావుపేట అసెంబ్లీకి నక్కపల్లి తహసీల్దారు కార్యాలయంలో స్వీకరణ

మిగిలినచోట్ల అసెంబ్లీ నియోజకవర్గం కేంద్రాల్లోనే...

25వ తేదీ వరకు నామిషన్లు దాఖలుకు అవకాశం

26న పరిశీలన, ఉపసంహరణకు 29వ తేదీ వరకు గడువు

అనకాపల్లి, ఏప్రిల్‌ 17 (ఆంధ్రజ్యోతి):

సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో మరో ఘట్టం ప్రారంభం కానున్నది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నుంచి గురువారం నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. ఎన్నికల కమిషన్‌ గతంలో విడుదల చేసిన షెడ్యూల్‌, ఆదేశాల మేరకు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ రవి పట్టన్‌శెట్టి ఆధ్వర్యంలో నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు పూర్తిచేశారు. అనకాపల్లి జిల్లాలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులను(ఆర్‌ఓ)లను ఇప్పటికే నియమించారు. నామినేషన్లు స్వీకరించే కేంద్రాలను కలెక్టర్‌ ఇప్పటికే పరిశీలించారు. గురువారం ఉదయం 11 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసిన వెంటనే జిల్లాలో నామినేషన్ల స్వీకరణకు శ్రీకారం చుట్టనున్నారు. ఈ నెల 25వ తేదీ వరకు (21వ తేదీ ఆదివారం మినహా) మిగిలిన అన్ని రోజుల్లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు రిటర్నింగ్‌ అధికారులు నామినేషన్‌ పత్రాలను స్వీకరిస్తారు. 26వ తేదీన నామినేషన్‌ పత్రాల పరిశీలన, 27వ తేదీ నుంచి 29వ తేదీ మధ్యాహ్నం మూడు గంటల వరకు నామినేషన్‌ల ఉపసంహరణకు గడువు వుంది. కాగా పోటీ చేసే అభ్యర్థి లేదా అతను/ ఆమె ప్రతిపాదించిన వ్యక్తి ఎవరైనా రిటర్నింగ్‌ అధికారికి నామినేషన్‌ పత్రాలను అందజేయవచ్చు. ఆన్‌లైన్‌లో సువిధ యాప్‌ ద్వారా కూడా నామినేషన్‌ పత్రాలు సమర్పించే అవకాశం ఉంది. కానీ ఆన్‌లైన్‌లో సమర్పించిన ఫారం-2బీ, ఇతర కాపీలను ప్రింట్‌ తీసి ఆర్‌ఓకు తప్పనిసరిగా అందజేయాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు అయితే రూ.5 వేలు, ఇతరులు రూ.10 వేలును డిపాజిట్‌గా ఆర్‌ఓ కార్యాలయంలో జమ చేయాలి. నామినేషన్‌ వేసే అభ్యర్థి తరపున మూడు వాహనాలను మాత్రమే ఆర్‌ఓ కార్యాలయంలోకి అనుమతిస్తారు. అభ్యర్థితోపాటు ఐదుగురిని మాత్రమే ఆర్‌ఓ చాంబర్‌లోకి అనుమతిస్తారు.

నామినేషన్ల స్వీకరణ కేంద్రాలు ఇవే...

నియోజకవర్గం స్వీకరణ కేంద్రం

అనకాపల్లి జీవీఎంసీ మీటింగ్‌ హాలు, గుండాల జంక్షన్‌, గాంధీనగరం

చోడవరం తహసీల్దారు కార్యాలయం, చోడవరం

మాడుగుల తహసీల్దారు కార్యాలయం, మాడుగుల

నర్సీపట్నం ఆర్డీఓ కార్యాలయం, నర్సీపట్నం

పాయకరావుపేట తహసీల్దారు కార్యాలయం, నక్కపల్లి

ఎలమంచిలి తహసీల్దారు కార్యాలయం, ఎలమంచిలి

అనకాపల్లి ఎంపీ జిల్లా కలెక్టరేట్‌, అనకాపల్లి

అసెంబ్లీ నియోజకవర్గాల ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులు, ఫోన్‌ నంబర్లు

నియోజకవర్గం ఆర్‌వో ఫోన్‌ నంబర్‌

అనకాపల్లి ఎం.జాహ్నవి 77028 96799

చోడవరం ఎ.జి.చిన్నికృష్ణ 89782 81888

మాడుగుల బి.వి.సత్యవేణి 91003 84699

నర్సీపట్నం హెచ్‌వీ జయరామ్‌ 78939 64954

పాయకరావుపేట కె.గీతాంజలి 83330 25635

ఎలమంచిలి కె.మనోరమ 99593 33477

Updated Date - Apr 18 , 2024 | 01:24 AM