బటర్‌ఫ్లై ప్రాజెక్టుకు కదలిక
ABN , Publish Date - Nov 28 , 2024 | 01:45 AM
మన్యంలోని ప్రకృతి అందాలకు కొదవలేదు. వీటిని తీలకించేందుకు వచ్చే పర్యాటకులు ఆనందంతో పరవశిస్తుంటారు. అయితే పర్యాటకులకు మరిన్ని సౌకర్యలతో ప్రాజెక్టులను నిర్మించాలన్న ఆలోచనతో అటవీ శాఖ అడుగులు ముందుకు వేసింది. ఓ వైపు పర్యావరణాన్ని కపాడుకుంటూ మరోవైపు పర్యాటక రంగం అభివృద్ధి అటవీ శాఖ ప్రత్యేక దృష్టిసారించింది. పర్యాటకులు ప్రకృతి ఒడిలో రాత్రిఇ బసచేసేలా, ప్రకృతి అందాలను దగ్గరనుంచి వీక్షించేలా అనంతగిరి మండలం మర్ధగుడ వద్ద సీతాకోకచిలుకల ప్రాజెక్టును ఏర్పాటు చేస్తున్నది.

మార్చిలోపు సీతాకోకచిలుకల పార్కు ఏర్పాటు
సాంకేతిక సమస్యలను పరిష్కరించి, ప్రతిపాదనలు సిద్ధం
చిలకలగెడ్డ వద్ద ఎకో పార్కు అభివృద్ధి
దివీస్ సౌజన్యంతో ఆర్వో ప్లాంట్లు
అనంతగిరి, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): మన్యంలోని ప్రకృతి అందాలకు కొదవలేదు. వీటిని తీలకించేందుకు వచ్చే పర్యాటకులు ఆనందంతో పరవశిస్తుంటారు. అయితే పర్యాటకులకు మరిన్ని సౌకర్యలతో ప్రాజెక్టులను నిర్మించాలన్న ఆలోచనతో అటవీ శాఖ అడుగులు ముందుకు వేసింది. ఓ వైపు పర్యావరణాన్ని కపాడుకుంటూ మరోవైపు పర్యాటక రంగం అభివృద్ధి అటవీ శాఖ ప్రత్యేక దృష్టిసారించింది. పర్యాటకులు ప్రకృతి ఒడిలో రాత్రిఇ బసచేసేలా, ప్రకృతి అందాలను దగ్గరనుంచి వీక్షించేలా అనంతగిరి మండలం మర్ధగుడ వద్ద సీతాకోకచిలుకల ప్రాజెక్టును ఏర్పాటు చేస్తున్నది.
మార్చినాటికి సీతాకోకచిలుకల ప్రాజెక్టు రెడీ
మర్ధగుడ వద్ద దట్టమైన అటవీ ప్రాంతంలో సీతాకోకచిలుకల ప్రాజెక్టు నిర్మాణానికి ఉమ్మడి జిల్లాల డీఎఫ్‌వో అనంతశంకర్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. సింహాద్రి ఎన్టీపీసీ సహకారంతో రూ.5.5 కోట్లతో మూడేళ్ల క్రితం సీతాకోకచిలుకల ప్రాజెక్టు ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. రూ.80 లక్షలతో కాఫీహౌస్, ట్రాన్స్‌ఫార్మర్, గ్రావిటీ తాగునీటి పథకం, ట్యాంకు నిర్మాణం, రోడ్డు పనులు జరిగాయి. తరువాత సాంకేతిక సమస్యల కారణంగా పనులు నిలిచిపోయాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అటవీ శాఖ అధికారులు దృష్టిసారించారు. ప్రాజెక్టులో రూ.4.7 కోట్లతో చేపట్టాల్సిన పనులకు సంబంఽధించి ప్రతిపాదనలు సిద్ధం చేసి అటవీ శాఖ అందజేసింది. ఇందులో 16 కాటేజీలు, రెస్టారెంట్, రిసెప్షన్, ఫర్నీచర్, విద్యుత్ కనెక్షన్లు తదితర మౌలికవసతులు కల్పిస్తారు. వచ్చే ఏడాది మార్చిలోపు పనులన్నీ పూర్తిచేసి పర్యాటకులకు అందుబాటులోకి తీసుకురానున్నారు.
ఎకో పార్కు అభివృద్ధి
మన్యానికి ముఖద్వారమైన చిలకలగెడ్డ చెక్‌పోస్టును ఆనుకుని ఎకో పార్కును అభివృద్ధి చేశారు. గతంలో పిచ్చిమొక్కలతో నిండిపోయిన ఈ ప్రాంతాన్నీ.. ఉన్నతాధికారులు ఆదేశాలతో ఎకో పార్కు పేరుతో నందనవనంగా మార్చారు రేంజర్ దుర్గాప్రసాద్, అటవీ సిబ్బంది. పర్యాటకులు కూర్చోడానికి, సేదదీరానికి వీలుగా పలు ఏర్పాట్లు చేశారు.
రూ.14.6 లక్షలతో ఆర్వో ప్లాంట్‌లు
సీతాకోకచిలుకల ప్రాజెక్టు, చిలకలగెడ్డ ఎకో పార్కు వద్ద రెండు ఆర్వో ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. ఒక్కో ఆర్వో ప్లాంట్‌కు రూ.7.3 లక్షలు వ్యయం అయ్యింది. దివీస్ కంపెనీ సీఎస్‌ఆర్ నిధుల నుంచి సమకూర్చింది. ప్రకృతి జల ప్రసాదం పేరుతో ఇటీవలే డీఎఫ్‌వో పీవీ సందీప్‌రెడ్డి, దివీస్ జనరల్ మేనేజర్ వై.ఎస్.కోటేశ్వరరావు ప్రారంభించారు.