Share News

గోవాడ షుగర్స్‌లో మొలాసిస్‌ నేలపాలు

ABN , Publish Date - Mar 29 , 2024 | 12:25 AM

మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా గోవాడ షుగర్‌ ఫ్యాక్టరీ పరిస్థితి ఉంది. ఒక పక్క ఇంటి దొంగలు ఫ్యాక్టరీలోని విలువైన సామగ్రిని ఎత్తుకుపోతుంటే, మరోవైపు సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ఫ్యాక్టరీకి మరింత నష్టం వాటిల్లుతోంది. ఫ్యాక్టరీలో గురువారం ఉదయం మొలాసిస్‌ లోడింగ్‌ చేసే వాల్వ్‌ ఊడిపోవడంతో ట్యాంకు నుంచి ఒక్కసారిగా బయటకు లీక్‌ అయ్యింది.

గోవాడ షుగర్స్‌లో మొలాసిస్‌ నేలపాలు
మొలాసిస్‌ ట్యాంకు నుంచి బయటకు పోతున్న మొలాసిస్‌

- ట్యాంకు వాల్వ్‌ ఊడిపోయి వృథా

చోడవరం, మార్చి 28: మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా గోవాడ షుగర్‌ ఫ్యాక్టరీ పరిస్థితి ఉంది. ఒక పక్క ఇంటి దొంగలు ఫ్యాక్టరీలోని విలువైన సామగ్రిని ఎత్తుకుపోతుంటే, మరోవైపు సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ఫ్యాక్టరీకి మరింత నష్టం వాటిల్లుతోంది. ఫ్యాక్టరీలో గురువారం ఉదయం మొలాసిస్‌ లోడింగ్‌ చేసే వాల్వ్‌ ఊడిపోవడంతో ట్యాంకు నుంచి ఒక్కసారిగా బయటకు లీక్‌ అయ్యింది. ట్యాంకు నుంచి బయటకు వచ్చిన మొలాసిస్‌ దిగువనున్న పిట్‌ నిండిపోయి చాలా వరకు నేలపాలైంది. తరువాత సిబ్బంది తేరుకుని మొలాసిస్‌ బయటకు రాకుండా చర్యలు చేపట్టారు. నేలపాలైన మొలాసిస్‌ సుమారు 5 టన్నులు వరకు ఉంటుందని అంచనా. దీని విలువ రూ.70 వేలు ఉంటుందని భావిస్తున్నారు. ఆస్తి నష్టం పెద్దగా లేకున్నా అసలే ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్న గోవాడ ఫ్యాక్టరీలో ఇటువంటి నష్టం కలిగించే పరిణామాలు వరుసగా చోటుచేసుకుంటుండడం విమర్శలకు తావిస్తోంది.

Updated Date - Mar 29 , 2024 | 12:25 AM