వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు
ABN , Publish Date - Sep 26 , 2024 | 11:31 PM
జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా స్థానిక ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజును నియమిస్తూ వైసీపీ అధిష్ఠానం గురువారం ప్రకటన విడుదల చేసింది.
పాడేరు, సెప్టెంబరు 26(ఆంధ్రజ్యోతి): జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా స్థానిక ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజును నియమిస్తూ వైసీపీ అధిష్ఠానం గురువారం ప్రకటన విడుదల చేసింది. రాష్ట్రంలో పలు జిల్లాలకు అధ్యక్షులు, ఇతర ఇన్‌చార్జులను ప్రకటించిన వైసీపీ.. స్థానిక ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజును జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ప్రకటించింది. స్థానిక మాజీ ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మిని వైసీపీ ఎస్‌టీ విభాగం రాష్ట్ర అధ్యక్షురాలిగా నియమించింది.