టీడీపీ సభ్యత్వం అంటే ఓ గౌరవం
ABN , Publish Date - Oct 27 , 2024 | 01:12 AM
పేద ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు ప్రారంభించిన తెలుగుదేశం పార్టీ సభ్యత్వం అంటే ఓ గౌరవమని గాజువాక నియోజకవర్గ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్ అన్నారు. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని శనివారం ఆయన గాజువాకలోని పార్టీ కార్యాలయంలో ప్రారంభించి, తొలి సభ్యత్వాన్ని తీసుకున్నారు.
గాజువాక నియోజకవర్గ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్
గాజువాక, అక్టోబరు 26: పేద ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు ప్రారంభించిన తెలుగుదేశం పార్టీ సభ్యత్వం అంటే ఓ గౌరవమని గాజువాక నియోజకవర్గ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్ అన్నారు. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని శనివారం ఆయన గాజువాకలోని పార్టీ కార్యాలయంలో ప్రారంభించి, తొలి సభ్యత్వాన్ని తీసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రెండేళ్ల కాల పరిమితో కూడిన నమోదు కార్డును టీడీపీ సభ్యత్వం తీసుకున్న వారికి అందజేయడం జరుగుతుందని, దీనివల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలోనే అత్యధిక మోజారిటీలో పల్లా శ్రీనివాసరావు గాజువాక ఎమ్మెల్యేగా విజయం సాధించారని, అదేవిధంగా రాష్ట్రంలో అత్యధిక సభ్యత్వ నమోదును నియోజకవర్గంలో పూర్తి చేసి సీఎం చంద్రబాబుకు బహుమతిగా ఇద్దామన్నారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ గొర్లె వెంకునాయుడు, నాయకులు చెరుకూరి నాగేశ్వరరావు, తమిర శివప్రసాదరావు, పి.వెంకటేశ్వరరావు, పి.సొమినాయుడు, అడుసుమల్లి దీప్తి, పప్పు శంకరరావు, అప్పారావు, వి.కొండబాబు, తదితరులు పాల్గొన్నారు.