Share News

చెరువులవేనంలో మంచు సోయగం

ABN , Publish Date - Feb 28 , 2024 | 11:25 PM

ఆంధ్ర కశ్మీర్‌ లంబసింగికి సమీపంలో ఉన్న చెరువులవేనం ప్రకృతి అందాలు సీజన్‌ ఆఖరిలోనూ పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. ఓ వైపు శీతాకాల సీజన్‌ ముగుస్తుండడంతో కనిష్ఠ ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి.

చెరువులవేనంలో మంచు సోయగం
చెరువులవేనంలో మంచు అందాలు

చింతపల్లి, ఫిబ్రవరి 28: ఆంధ్ర కశ్మీర్‌ లంబసింగికి సమీపంలో ఉన్న చెరువులవేనం ప్రకృతి అందాలు సీజన్‌ ఆఖరిలోనూ పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. ఓ వైపు శీతాకాల సీజన్‌ ముగుస్తుండడంతో కనిష్ఠ ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. దీంతో మరో వారం, పది రోజుల్లో చెరువులవేనంలో ప్రకృతి అందాలు కనుమరుగుకానున్నాయి. ఈ తరుణంలో నాలుగు రోజులుగా చెరువులవేనం వ్యూపాయింట్‌ వద్ద రమణీయమైన మంచు అందాలు ఆవిష్కృతమవుతున్నాయి. పచ్చని అడవులను తాకుతూ పయనిస్తున్న మంచు మేఘాలు వీక్షకులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. దీంతో ఈ ప్రకృతి అందాలను వీక్షించేందుకు పర్యాటకులు క్యూకడుతున్నారు. బుధవారం ఆవిష్కృతమైన మంచు సోయగాలు సందర్శకులను కనువిందు చేశాయి.

Updated Date - Feb 28 , 2024 | 11:25 PM