Share News

కల్తీ మద్యంతో పేదల బతుకులు ఛిద్రం

ABN , Publish Date - Mar 01 , 2024 | 11:40 PM

మద్యం, కల్తీ మద్యం అమ్మకాల వల్ల పేదల బతుకులు నాశ నమవుతున్నాయని ఏపీ మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి ఎండీ బేగం అన్నారు.

కల్తీ మద్యంతో పేదల బతుకులు ఛిద్రం

ఆరిలోవ, మార్చి 1 : మద్యం, కల్తీ మద్యం అమ్మకాల వల్ల పేదల బతుకులు నాశ నమవుతున్నాయని ఏపీ మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి ఎండీ బేగం అన్నారు. అంత ర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని శుక్రవారం ఏపీ మహిళా సమాఖ్య ఆధ్వ ర్యంలో మహిళలు ఆరిలోవ ఆఖరి బస్టాపు సమీపంలో ఉన్న శివాజీనగర్‌లో సమావేశ మయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తాము అధికారంలోకి వస్తే మద్య నిషేధం విధిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి జగన్‌ ఇచ్చిన హామీని అమలు చేయకపోగా మద్యం అమ్మకాలను మరింతగా ప్రోత్సహిస్తున్నారన్నారు. కల్తీ మద్యం వల్ల అనేక మంది మృతి చెందుతున్నారని, కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఆవే దన వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి మహిళలంతా సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా సమాఖ్య ఏరియా ప్రధాన కార్యదర్శి బొత్స పుష్పలత, మహిళా నేతలు సరస్వతి, రూప, సత్యవతి, లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 01 , 2024 | 11:40 PM