Share News

కూటమి అభ్యర్థిని గెలిపించుకుందాం

ABN , Publish Date - Apr 25 , 2024 | 01:14 AM

రకులోయ అసెంబ్లీ నియోజకవర్గంలో పొత్తు ధర్మాన్ని పాటించి కూటమి బీజేపీ అభ్యర్థి పాంగి రాజారావును గెలిపించుకుందామని టీడీపీ అరకు నియోజకవర్గ ఇన్‌చార్జి సియ్యారి దొన్నుదొర పిలుపునిచ్చారు. అరకులోయలోని ఓ రిసార్టు ప్రాంగణంలో తన మద్దతుదారులతో బుధవారం నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 21న పార్టీ ఉత్తరాంధ్ర ఇన్‌చార్జి సీతంరాజు సుధాకర్‌తో కలిసి తాను విజయవాడలో పార్టీ అధినేత చంద్రబాబును కలిశానన్నారు. బీజేపీ అగ్రనేతల ఒత్తిడి మేరకు అరకు అసెంబ్లీ స్థానాన్ని ఆ పార్టీకి కేటాయించాల్సి వచ్చిందని చంద్రబాబు వివరించారన్నారు. రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా కూటమి ఏర్పడిందని చెప్పారన్నారు.

కూటమి అభ్యర్థిని గెలిపించుకుందాం
సంఘీభావం తెలుపుతున్న దొన్నుదొర, పాంగి రాజారావు తదితరులు

- పొత్తు ధర్మం పాటిద్దాం

- రాష్ట్ర భవిష్యత్తు కోసమే ఈ నిర్ణయం

- టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి దొన్నుదొర

అరకులోయ, ఏప్రిల్‌ 24: అరకులోయ అసెంబ్లీ నియోజకవర్గంలో పొత్తు ధర్మాన్ని పాటించి కూటమి బీజేపీ అభ్యర్థి పాంగి రాజారావును గెలిపించుకుందామని టీడీపీ అరకు నియోజకవర్గ ఇన్‌చార్జి సియ్యారి దొన్నుదొర పిలుపునిచ్చారు. అరకులోయలోని ఓ రిసార్టు ప్రాంగణంలో తన మద్దతుదారులతో బుధవారం నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 21న పార్టీ ఉత్తరాంధ్ర ఇన్‌చార్జి సీతంరాజు సుధాకర్‌తో కలిసి తాను విజయవాడలో పార్టీ అధినేత చంద్రబాబును కలిశానన్నారు. బీజేపీ అగ్రనేతల ఒత్తిడి మేరకు అరకు అసెంబ్లీ స్థానాన్ని ఆ పార్టీకి కేటాయించాల్సి వచ్చిందని చంద్రబాబు వివరించారన్నారు. రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా కూటమి ఏర్పడిందని చెప్పారన్నారు. తనకు భవిష్యత్తులో మంచి స్థానం కల్పిస్తానని హామీ ఇచ్చారన్నారు. తాను ఉన్నత స్థానంలో ఉంటే మీ అందరికి మంచి జరుగుతుందని తన మద్దతుదారులకు చెప్పారు. అందుకే సమష్టిగా, చిత్తశుద్ధితో పని చేసి బీజేపీ అభ్యర్థి పాంగి రాజారావును గెలిపించుకుందామని వారికి చెప్పారు. ఈ సందర్భంగా పార్టీ ఉత్తరాంధ్ర ఇన్‌చార్జి సీతంరాజు సుధాకర్‌ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే దొన్నుదొరకు మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. బీజేపీ అరకు అసెంబ్లీ అభ్యర్థి పాంగి రాజారావు మాట్లాడుతూ పొత్తు ధర్మాన్ని పాటించి తనను గెలిపించాలని, భవిష్యత్తులో తనకన్నా ఉన్నత స్థానంలో దొన్నుదొర ఉంటారని చెప్పారు. బీజేపీ పరిశీలకుడు శ్రీనివాస్‌ మాట్లాడుతూ పార్టీ ఉత్తరాంధ్ర ఇన్‌చార్జి సీతంరాజు సుధాకర్‌ ఆధ్వర్యంలో దొన్నుదొర, రాజారావు ఒక్కటి కావడం ఆనందంగా ఉందన్నారు. ఈ సమావేశంలో అధిక సంఖ్యలో టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Apr 25 , 2024 | 01:14 AM