కొత్తవలస- కోరాపుట్ డబ్లింగ్ రైల్వే లైన్ ప్రారంభం
ABN , Publish Date - Mar 13 , 2024 | 12:49 AM
కొత్తవలస- కోరాపుట్ డబ్లింగ్ రైల్వే లైన్‌ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంగళవారం వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఇందులో భాగంగా అరకు రైల్వే స్టేషన్‌లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.
వర్చువల్‌గా ప్రారంభించిన ప్రధాని మోదీ
అరకు రైల్వే స్టేషన్‌లో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు
అరకులోయ, మార్చి 12: కొత్తవలస- కోరాపుట్ డబ్లింగ్ రైల్వే లైన్‌ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంగళవారం వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఇందులో భాగంగా అరకు రైల్వే స్టేషన్‌లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఎం.విజయసునీత మాట్లాడుతూ కొత్తవలస- కోరాపుట్ స్టేషన్ల మధ్య డబ్లింగ్ పనులకు రైల్వే శాఖ సుమారు రూ.125 కోట్లు ఖర్చు చేసిందన్నారు. ఈ డబ్లింగ్ రైల్వే లైన్‌ను, అలాగే అరకు, బొర్రా గుహలు రైల్వే స్టేషన్లలో వన్ స్టేషన్- వన్ ప్రొడక్టుకు సంబంధించిన అధునాతన స్టాల్స్‌ను ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రారంభించి జాతికి అంకితం చేశారన్నారు. డబ్లింగ్ రైల్వే లైన్ అందుబాటులోకి రావడం వల్ల కొత్త రైళ్ల రాకపోకలకు అవకాశం ఉంటుందన్నారు. అనంతరం చేతి వృత్తి కళాకారులు ఏర్పాటు చేసిన వస్తు ప్రదర్శనను రైల్వే అధికారులతో కలిసి ఆమె తిలకించారు. ఈ కార్యక్రమంలో రైల్వే చీఫ్ ప్రోగ్రాం ఆఫీసర్ సూర్యప్రకాశ్, సీనియర్ డీఈఈ పాండేటాం, డిప్యూటీ సీఈ రాజీవ్‌కుమార్, అరకు డీఎంవో కోహింజ్‌దేవి, అరకు ఏడీఈఈ ఎన్.బి.నాగేంద్రరావు, బీజేపీ అరకు మండల అధ్యక్షుడు రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.