Share News

నారా లోకేశ్‌ను కలిసిన కిడారి, దొన్నుదొర

ABN , Publish Date - Nov 13 , 2024 | 12:29 AM

రాష్ట్ర మానవ వనరులు, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌ను తెలుగుదేశం పార్టీ అరకులోయ పార్లమెంట్‌ అధ్యక్షుడు, జీసీసీ చైర్మన్‌ కిడారి శ్రావణ్‌కుమార్‌, ఆర్టీసీ విజయనగరం రీజియన్‌ చైర్మన్‌ దొన్నుదొర వేర్వేరుగా మంగళవారం అమరావతిలో మర్యాదపూర్వకంగా కలిశారు. తనకు జీసీసీ చైర్మన్‌గా అవకాశం కల్పించినందుకు శ్రావణ్‌కుమార్‌ కృతజ్ఞతలు తెలిపారు. జీసీసీకి పూర్వవైభవం తీసుకువచ్చి రాష్ట్రంలోని గిరిజనులకు సేవ చేయడంతోపాటు వారి ఆదాయం పెంపునకు కృషి చేస్తానని చెప్పారు. తనను ఆర్టీసీ విజయనగరం రీజియన్‌ చైర్మన్‌గా నియమించినందుకు దొన్నుదొర కృతజ్ఞతలు తెలిపారు. బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకువస్తానని పేర్కొన్నారు.

నారా లోకేశ్‌ను కలిసిన కిడారి, దొన్నుదొర
మంత్రి నారా లోకేశ్‌ను కలిసిన జీసీసీ చైర్మన్‌ శ్రావణ్‌కుమార్‌, ఆర్టీసీ విజయనగరం రీజియన్‌ చైర్మన్‌ దొన్నుదొర


పాడేరు/అరకులోయ, నవంబరు 12(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర మానవ వనరులు, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌ను తెలుగుదేశం పార్టీ అరకులోయ పార్లమెంట్‌ అధ్యక్షుడు, జీసీసీ చైర్మన్‌ కిడారి శ్రావణ్‌కుమార్‌, ఆర్టీసీ విజయనగరం రీజియన్‌ చైర్మన్‌ దొన్నుదొర వేర్వేరుగా మంగళవారం అమరావతిలో మర్యాదపూర్వకంగా కలిశారు. తనకు జీసీసీ చైర్మన్‌గా అవకాశం కల్పించినందుకు శ్రావణ్‌కుమార్‌ కృతజ్ఞతలు తెలిపారు. జీసీసీకి పూర్వవైభవం తీసుకువచ్చి రాష్ట్రంలోని గిరిజనులకు సేవ చేయడంతోపాటు వారి ఆదాయం పెంపునకు కృషి చేస్తానని చెప్పారు. తనను ఆర్టీసీ విజయనగరం రీజియన్‌ చైర్మన్‌గా నియమించినందుకు దొన్నుదొర కృతజ్ఞతలు తెలిపారు. బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకువస్తానని పేర్కొన్నారు.

Updated Date - Nov 13 , 2024 | 12:29 AM