Share News

జీవో నంబరు 85ను వెనక్కి తీసుకోవాలి

ABN , Publish Date - Jul 31 , 2024 | 12:10 AM

ప్రభుత్వ వైద్యుల పీజీ ప్రవేశం కోసం ఇన్‌ సర్వీస్‌ కోటాను తగ్గిస్తూ విడుదల చేసిన జీవో నంబరు 85ను వెనక్కి తీసుకోవాలని కోరుతూ మంగళవారం డీసీహెచ్‌ఎస్‌ శ్రీనివాస్‌, డీఎం అండ్‌ హెచ్‌వో బాలాజీలను ప్రభుత్వ వైద్యుల సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఈస్టర్‌ రాణి, తిరుపతిరావు కోరారు.

జీవో నంబరు 85ను వెనక్కి తీసుకోవాలి
డీఎంహెచ్‌వోకు వినతిపత్రం ఇస్తున్న వైద్యులు

అనకాపల్లి టౌన్‌, జూలై 30: ప్రభుత్వ వైద్యుల పీజీ ప్రవేశం కోసం ఇన్‌ సర్వీస్‌ కోటాను తగ్గిస్తూ విడుదల చేసిన జీవో నంబరు 85ను వెనక్కి తీసుకోవాలని కోరుతూ మంగళవారం డీసీహెచ్‌ఎస్‌ శ్రీనివాస్‌, డీఎం అండ్‌ హెచ్‌వో బాలాజీలను ప్రభుత్వ వైద్యుల సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఈస్టర్‌ రాణి, తిరుపతిరావు కోరారు. ఈ మేరకు వారికి వినతి పత్రాలు అందజేశారు. జీవోను వెనక్కి తీసుకుని ఇన్‌ సర్వీస్‌ కోటాను మునుపటి మాదిరిగానే ఉంచాలని, ఇది సాధించే వరకు తాము పోరాడతామని సంఘ ప్రతినిధులు కోరారు.

Updated Date - Jul 31 , 2024 | 12:12 AM